ఆఖరి సెషన్‌లో చెలరేగిన జడేజా-అక్షర్.. భారీ ఆధిక్యంలో టీమిండియా

by Vinod kumar |   ( Updated:2023-02-13 14:17:48.0  )
ఆఖరి సెషన్‌లో చెలరేగిన జడేజా-అక్షర్.. భారీ ఆధిక్యంలో టీమిండియా
X

దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టుబిగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ జట్టు 321 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. టీమిండియా 144 పరుగుల ఆధిక్యంలో ఉంది. కెప్టెన్ రోహిత్ శర్మ రోహిత్ శర్మ (212 బంతుల్లో 120; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో అదరగొట్టగా.. ఆఖరి సెషన్‌లో చెలరేగిన జడేజా.. అక్షర్.. టీమిండియాకు భారీ ఆధిక్యం అందించారు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (170 బంతుల్లో 66 బ్యాటింగ్; 9 ఫోర్లు) నాటౌట్‌గా నిలిచాడు. రవీంద్ర జడేజా (170 బంతుల్లో 66 బ్యాటింగ్; 9 ఫోర్లు), అక్షర్ పటేల్ (102 బంతుల్లో 52 బ్యాటింగ్; 8 ఫోర్లు) భారత్‌కు భారీ ఆధిక్యాన్ని అందించారు. మిగిలిన టీమిండియా బ్యాటర్స్.. పుజారా(7), కోహ్లీ(12), సూర్య(8), కేఎస్ భరత్(8) విఫలం అయ్యారు. ఆసీస్‌ బౌలర్లలో మర్ఫీ 5 వికెట్లు తీయగా.. కమిన్స్‌, నాథన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ప్రస్తుతం భారత్‌ 144 పరుగుల ఆధిక్యంలో ఉంది.

Advertisement

Next Story

Most Viewed