- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Shubman Gill : మూడు మ్యాచ్‌ల సిరీస్‌గానే భావిస్తున్నాం.. : గిల్
దిశ, స్పోర్ట్స్ : బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌గానే భావిస్తున్నట్లు భారత బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ అన్నాడు. శుక్రవారం బ్రిస్బేన్‌లో మీడియాతో గిల్ మాట్లాడారు. ‘జట్టులో మంచి హుషారులో ఉంది. జట్టంతా కలిసి నిన్న డిన్నర్‌లో పాల్గొన్నాం. మేము అనుకున్న రీతిలో అడిలైడ్ టెస్ట్ సాగలేదు. కానీ ట్రోఫీని మూడు మ్యాచ్‌ల సిరీస్‌గానే భావిస్తున్నాం. ఈ మ్యాచ్‌లో గెలిస్తే రాబోయే రెండు టెస్టుల్లో పైచేయి మాదే. మూడో టెస్ట్‌లో గెలిచి 2-0 ఆధిక్యంలోకి రావాలని భావిస్తున్నాం. గబ్బా మైదానం కొత్త అనుభూతిని ఇచ్చింది. తప్పకుండా ఈ వికెట్ మీద ఆడటాన్ని ఆస్వాదిస్తాం.’ అని గిల్ అన్నాడు. చివరి సారిగా గబ్బాలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో గిల్(91), పంత్(89) రాణించడంతో భారత్ 328 పరుగుల లక్ష్యాన్ని ఛేజింగ్ చేసింది. దీంతో 33 ఏళ్ల తర్వాత బ్రిస్బేన్‌లో భారత్ విజయం సొంతం చేసుకున్నట్లయింది. రేపటి (శనివారం) నుంచి బ్రిస్బేన్ టెస్ట్ ఆరంభం కానుంది.