- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Olympic : జస్ట్ మిస్.. పారిస్ ఒలంపిక్స్‌లో భారత్‌కు తృటిలో చేజారిన పతకం
దిశ, వెబ్‌డెస్క్: ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా జరుగుతోన్న ఒలంపిక్ గేమ్స్‌లో భారత్‌కు తృటిలో పతకం చేజారింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో మెడల్ మిస్ అయ్యింది. సోమవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్‌లో భారత షూటర్ అర్జున్ బబుతా చివరి వరకు వీరోచితంగా పోరాడిన ఫలితం లేకుండా పోయింది. ఫైనల్‌లో 208.4 పాయింట్లు సాధించి అర్జున్ ఫోర్త్ ప్లేస్‌కు పరిమితం కావడంతో తృటిలో భారత్ పతాకాన్ని కోల్పోయింది.
పతకం మిస్ కావడంతో అభిమానులు కాస్త నిరాశపడినప్పటికీ.. అర్జున్ బబుతా పోరాటానికి ప్రశంసలు కురిపిస్తున్నారు. బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ అంటూ అండగా నిలుస్తున్నారు. కాగా, పారిస్ ఒలంపిక్స్‌లో ఇండియా ఇప్పటికే పతక బోణీ చేసిన విషయం తెలిసిందే. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో స్టార్ షూటర్ మను భాకర్ బ్రాంజ్ మెడల్ గెలిచి పారిస్ ఒలంపిక్స్‌లో భారత్‌కు తొలి పతకాన్ని అందించింది.
- Tags
- Olympic Games