భారత్‌కు న్యూజిలాండ్ షాక్

by Harish |
భారత్‌కు న్యూజిలాండ్ షాక్
X

దిశ, స్పోర్ట్స్ : చైనాలో జరుగుతున్న బిల్లీ జీన్ కింగ్ కప్ మహిళల టెన్నిస్ టోర్నీలో భారత్ ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతయ్యాయి. తర్వాతి రౌండ్‌కు చేరుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత జట్టు నిరాశపర్చింది. ఆసియా/ఒషియానియా గ్రూపు-1లో శనివారం జరిగిన చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో 2-1 తేడాతో ఓడిపోయింది. మొదట సింగిల్స్ మ్యాచ్‌లో రుతుజ 6-2, 7-6(7-5) తేడాతో మోనిక్ బారీని చిత్తు చేసి జట్టుకు శుభారంభం అందించింది. అయితే, రెండో సింగిల్స్ మ్యాచ్‌లో అంకిత రైనా 2-6, 0-6 తేడాతో లులు సన్ చేతిలో ఓడటంతో మ్యాచ్ నిర్ణయాత్మక మూడో గేమ్‌కు వెళ్లింది. డబుల్స్ మ్యాచ్‌లో అంకిత రైనా-ప్రార్థన జోడీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయింది. భారత జంట 1-6, 5-7 తేడాతో హౌరిగన్-రౌట్‌లిప్ చేతిలో పరాజయం పొందడంతో భారత్ మ్యాచ్‌తోపాటు ప్లే ఆఫ్స్ బెర్త్‌ను కోల్పోయింది. దీంతో ఓటమితో భారత్ టోర్నీ నుంచి నిష్ర్కమించింది. గ్రూపులో టాప్-2 జట్లు చైనా, కొరియా తర్వాతి రౌండ్‌కు అర్హత సాధించాయి. వచ్చే ఏడాది కూడా భారత్ గ్రూపు-1లోనే ఆడనుంది.

Advertisement

Next Story

Most Viewed