- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చైనీస్ తైపీపై భారత్ గెలుపు
దిశ, స్పోర్ట్స్ : చైనాలో జరుగుతున్న బిల్లీ జీన్ కింగ్స్ కప్ టెన్నిస్ టోర్నీలో భారత్ పుంజుకుంది. ఆసియా/ఒషియానియా గ్రూపు-1లో ఆడుతున్న భారత్ రెండో మ్యాచ్‌లో చైనా చేతిలో వెనుకబడింది. అయితే, గురువారం జరిగిన కీలకమైన మూడో మ్యాచ్‌లో చైనీస్ తైపీపై విజయం సాధించి తిరిగి గెలుపు బాటపట్టింది. ఈ మ్యాచ్‌లో చైనీస్ తైపీ జట్టును 2-1 తేడాతో భారత్ ఓడించింది. మొదటి మ్యాచ్‌లో రుతుజ 6-3, 6-2 తేడాతో హావో చింగ్ చాన్‌ను చిత్తు చేసిన భారత్‌కు శుభారంభం అందించింది. అయితే, అంకిత రైనా ఆ జోరును కొనసాగించలేకపోయింది. రెండో మ్యాచ్‌లో అంకిత రైనా 6-2, 4-6, 4-6 తేడాతో ఎన్ షువో లియాంగ్ చేతిలో ఓడింది. ఇక, నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో అంకిత రైనా-ప్రార్థన జోడీ 4-6, 6-1, 15-13 తేడాతో చాన్-లియాంగ్ జంటపై అద్భుత విజయం సాధిండంతో మ్యాచ్ భారత్ కైవసమైంది. గ్రూపు-లో భారత్ రెండు విజయాలు, ఒక్క ఓటమితో ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్నది. మిగతా రెండు మ్యాచ్‌ల్లో కొరియా, న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది.