భారత ‘ఏ’ జట్టు కెప్టెన్‌గా అభిమన్యు ఈశ్వరన్

by Swamyn |
భారత ‘ఏ’ జట్టు కెప్టెన్‌గా అభిమన్యు ఈశ్వరన్
X

దిశ, స్పోర్ట్స్ : ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్ జట్టు ఈ నెలలో భారత్‌కు రానున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌కు ముందు ఇంగ్లాండ్ లయన్స్‌తో భారత ‘ఏ’ జట్టు రెండు రోజుల వార్మప్ మ్యాచ్‌తోపాటు మల్టీ డే మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లకు బీసీసీఐ శనివారం 13 మందితో కూడిన భారత్ ‘ఏ’ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు అభిమన్యు ఈశ్వరన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది.టీమ్ ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన తెలుగు కుర్రాడు కేఎస్ భరత్‌‌తోపాటు సాయి సుదర్శన్, నవదీప్ సైనీ జట్టులో ఉన్నారు.అలాగే, దేశవాళీ టోర్నీలతోపాటు ఐపీఎల్ మెరిసిన ఆకాశ్ దీప్, తుషార్ దేశ్‌పాండే, ధ్రువ్ జురెల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ఆకాశ్ దీప్, విద్వత్ కావేరప్పలకు చోటు దక్కింది. కాగా, ఈ రెండు మ్యాచ్‌లు అహ్మదాబాద్ వేదికగానే జరగన్నాయి. ఈ నెల 12, 13 తేదీల్లో వార్మప్ మ్యాచ్, ఈ నెల 17-20 మధ్య మల్టీ డే మ్యాచ్ జరగనుంది.

భారత ‘ఏ’ జట్టు : అభిమన్యు ఈశ్వరన్(కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ప్రదోష్ రంజన్ పాల్, కేఎస్ భరత్, మానవ్ సుతార్, పుల్కిత్ నారంగ్, తుషార్ దేశ్‌పాండే, విద్వత్ కావేరప్ప, ధ్రువ్ జురెల్, ఆకాశ్ దీప్.


Advertisement

Next Story

Most Viewed