- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంగ్లాండ్ లయన్స్‌పై భారత ఏ జట్టు గెలుపు
దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ లయన్స్‌తో రెండో అనధికార టెస్టు భారత ఏ జట్టు సొంతమైంది. చివరి రోజైన శనివారం ఇంగ్లాండ్ లయన్స్‌పై ఇన్నింగ్స్ 16 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ లయన్స్ 152 పరుగులకు ఆలౌటవ్వగా.. భారత ఏ జట్టు 489 పరుగులు చేసింది. దీంతో భారత ఏ జట్టుకు 337 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది. భారత బౌలర్లు చెలరేగడంతో శుక్రవారమే రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ లయన్స్ 304/8 స్కోరుతో నిలిచి ఓటమి అంచున నిలిచింది. నాలుగో రోజు ఓవర్‌నైట్ స్కోరుకు మరో 17 పరుగులు మాత్రమే జతచేసి ఆలౌటైంది. ఓవర్ నైట్ బ్యాటర్ రాబిన్సన్(85)ను అర్ష్‌దీప్ సింగ్ అవుట్ చేయగా.. యష్ దయాల్ బౌలింగ్‌లో ఆఖరి వికెట్‌గా టామ్ లావెస్(32)పెవిలియన్ చేరడంతో ప్రత్యర్థి ఆట ముగిసింది. దీంతో మూడు అనధికార టెస్టు సిరీస్‌లో భారత ఏ జట్టు 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి టెస్టు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే.