IND vs WI 5th T20: చెత్త రికార్డు మూటగట్టుకున్న టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌..

by Vinod kumar |
IND vs WI 5th T20: చెత్త రికార్డు మూటగట్టుకున్న టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌..
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియాతో నిన్న జరిగిన ఐదో టీ20లో విండీస్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో సూర్యకుమార్‌ (61) మినహా అందరూ చేతులెత్తేయగా.. బౌలింగ్‌లో కుల్దీప్‌ యాదవ్‌IND vs WI 5th T20: చెత్త రికార్డు మూటగట్టుకున్న టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌..(4-0-18-0) మినహా భారత బౌలర్ల ప్రదర్శన అత్యంత దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా ఓవరాక్షన్‌ బౌలింగ్‌తో 3 ఓవర్లలో 32 పరుగులు సమర్పించుకోగా.. అర్షదీప్‌ 2 ఓవర్లలో 20 పరుగులు సమర్పించుకున్నాడు. మ్యాచ్‌ మొత్తంలో అత్యంత పేలవమైన ప్రదర్శన కనబర్చిన ఘనత టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చహల్‌కు దక్కింది.

ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన చహల్‌ ఏకంగా 51 పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో ప్రత్యర్ధులు 5 సిక్సర్లు బాదారు. ఈ చెత్త గణాంకాలు నమోదు చేసే క్రమంలో చహల్‌ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాధించుకున్న బౌలర్‌గా న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ ఐష్‌ సోధి సరసన చేరాడు. సోధి తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో 129 సిక్సర్లు సమర్పించుకోగా.. చహల్‌ ఈ మ్యాచ్‌లో అతని రికార్డును సమం చేశాడు. ఈ విభాగంలో సోధి, చహల్‌ తర్వాత ఆదిల్‌ రషీద్‌ (119) ఉన్నాడు.

Advertisement

Next Story

Most Viewed