IND vs PAK: 'బై.. బై' హార్దిక్‌ పాండ్యా మార్క్‌ సెలబ్రేషన్‌.. బాబర్‌కు మండిపోయి ఉంటుందిగా!

by Vennela |   ( Updated:2025-02-23 13:19:36.0  )
IND vs PAK: బై.. బై హార్దిక్‌ పాండ్యా మార్క్‌ సెలబ్రేషన్‌.. బాబర్‌కు మండిపోయి ఉంటుందిగా!
X

దిశ, వెబ్ డెస్క్: IND vs PAK : భారత బౌలర్ హార్దిక్ పాండ్యా, పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను ఔట్ చేసిన తర్వాత 'బై బై' అంటూ స్టైల్‌గా సెలబ్రేట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

దుబాయ్‌లో జరుగుతున్న హై-వోల్టేజ్ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో, భారత క్రికెట్ స్టార్‌ హార్దిక్ పాండ్యా తన అద్భుతమైన బౌలింగ్‌తో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను 23 పరుగుల వద్ద పెవిలియన్‌కు పంపాడు. అయితే కేవలం వికెట్ తీసి మామూలుగా సెలబ్రేట్ చేయలేదు పాండ్యా. తనదైన శైలిలో 'బై బై' అంటూ మైమరిపించే సెండాఫ్ ఇచ్చాడు. ఈ సీన్ క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక మ్యాచ్ ప్రారంభమైనప్పటి నుంచి బాబర్ మంచి టచ్‌లో కనిపించాడు. ఇమామ్-ఉల్-హక్‌తో కలిసి ఓపెనింగ్ చేసిన బాబర్, భారత బౌలర్లను ఎదుర్కొంటూ బౌండరీల వర్షం కురిపించాడు. అతను 23 పరుగులు చేయడంలో ఐదు అద్భుతమైన బౌండరీలు కొట్టాడు. కానీ, ఇక్కడే ట్విస్ట్!

పాండ్యా బౌలింగ్‌కు రాగానే బౌండరి బాదాడు బాబార్. ఈ విషయం పాండ్యాకు అస్సలు నచ్చలేదు! ఆ వెంటనే తన మాస్టర్ స్ట్రోక్ వదిలాడు. ఒక అద్భుతమైన స్వింగ్ బంతి విసిరి బాబర్‌ను అడ్డుకోలేని పరిస్థితిలోకి నెట్టేశాడు. బాబర్ బ్యాట్ అంచున తగిలిన బంతి నేరుగా కేఎల్ రాహుల్ గ్లోవ్స్‌లోకి వెళ్ళింది. బాబర్ అవాక్కై వెనుదిరగగా, పాండ్యా తన స్టైల్‌లో "బై బై" అంటూ నాటకీయంగా సెలబ్రేట్ చేశాడు.

పాక్ జట్టు ఇప్పటికే న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలై ఒత్తిడిలో ఉంది. బాబర్ ఔటైన వెంటనే, ఇమామ్-ఉల్-హక్ కూడా అక్షర్ పటేల్ అద్భుతమైన త్రోకు బలయ్యాడు. ఒక్కసారిగా రెండు కీలక వికెట్లు కోల్పోయిన పాక్ జట్టు మరింత కష్టాల్లో పడింది. అయితే ఆ తర్వాత రిజ్వాన్‌, షకీల్‌ జిడ్డు బ్యాటింగ్‌ చేస్తూ నిలబడ్డారు.

Next Story

Most Viewed