IND Vs NZ: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. భారత జట్టులో కీలక మార్పులు

by Shiva |
IND Vs NZ: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. భారత జట్టులో కీలక మార్పులు
X

దిశ, వెబ్‌‌డెస్క్: మూడు మ్యాచ్‌ల టెస్ట్ సీరీస్‌లో భాగంగా ఇవాళ టీమిండియా (Team India) పూణే (Pune) వేదికగా రెండో టెస్ట్‌లో న్యూజిలాండ్‌ (Newzeland)తో తలపడబోతోంది. ఇప్పటికే సిరీస్‌లో భారత జట్టు (Team India) 1-0 తేడాతో వెనుకబడి ఉంది. అయితే, ముందుగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లాథమ్ (Tom Latham) ఏ మాత్రం సంకోచించకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, గత మ్యాచ్‌లో అనూహ్యంగా ఓటమి పాలైన టీమిండియా తుది జట్టులో ప్రక్షాళన చేపట్టింది. ఈ మేరకు జట్టులో మూడు కీలక మార్పులు చేసినట్లుగా టాస్ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ (Captain Rohith Sharma) తెలిపాడు.

హైదరాబాదీ స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohmad Siraj) స్థానంలో మరో పేసర్ ఆకాశ్ దీప్ (Akash Deep), మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) స్థానంలో శుభ్‌మన్ గిల్ (Shubhman Gil), స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ (Kuldeep Yadav) ప్లేస్‌లో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ (Washington Sunder)కు తుది జట్టులో స్థానం కల్పించారు. అదేవిధంగా న్యూజిలాండ్ (Newzeland) తమ తుది జట్టులో ఒకే ఒక్క మార్పు చేసి అందరినీ ఆశ్యర్యపరిచింది. మాట్ హెన్రీ (Matt Henry) స్థానంలో మిచెల్ సాంట్నర్‌ (Michelle Santner)ను జట్టులోకి తీసుకుంది. అయితే, రెండో టెస్ట్‌లో అయిన సిరీస్ సమం చేసి తిరిగి పోటీలో నిలవాలని టీమిండియా ప్రయత్నిస్తుండగా.. ఈ టెస్ట్‌లో విజయం సాధించి ఏకంగా సరీస్‌ను ఎగరేసుకుపోయేందుకు కివీస్ జట్టు ప్రణాళికలు రూపొందిస్తోంది.

భారత జట్టు..

యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (C), శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (WK), సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా.

న్యూజిలాండ్ జట్టు..

టామ్ లాథమ్ (C), డెవోన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (WK), గ్లెన్ ఫిలిప్స్, టిమ్ సౌథీ, మిచెల్ సాంట్నర్, అజాజ్ పటేల్, విలియం ఒరోర్కే.

Advertisement

Next Story

Most Viewed