- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మూడో టెస్టులో ముగిసిన మొదటి రోజు ఆట.. మళ్లీ తక్కువ పరుగులకు అవుట్ అయిన కోహ్లీ, రోహిత్
దిశ, వెబ్ డెస్క్: భారత్(India), న్యూజిలాండ్(New Zealand) జట్ల మధ్య ముంబాయి వేదికగా మూడో టెస్ట్ (3rd Test) మ్యాచ్ ప్రారంభం అయింది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. రెండు సెసన్లలో కలిపి న్యూజిలాండ్ జట్టు 65.4 ఓవర్లకు 235 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ జట్టు బ్యాటర్లలో లాథమ్ 28, విల్ యంగ్ 71, డారీ మిచెల్ 82, గ్లేన్ పిలిఫ్స్ 17 పరుగులు చేశారు. మిగిలిన ప్లేయర్లు ఎవరు సింగిల్ డిజిట్ స్కోరు కూడా దాటలేక పోయారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 5, వాషింగ్టన్ సుందర్ 4, ఆకాష్ దీప్ 1 వికెట్ తీసుకున్నారు. ఇదిలా ఉంటే చివరి సెషన్‌లో మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టుకు షాక్ తగిలింది. ఓపెనర్ జైస్వాల్ 30, రోహిత్ శర్మ 18 పరుగులకు అవుట్ కాగా.. కోహ్లీ మరోసారి తక్కువ పరుగులకు అవుట్ అయ్యాడు. అనంతరం నైట్ వాచ్‌మెన్‌గా క్రీజులోకి వచ్చిన మహ్మద్ సిరాజ్ డకౌట్ గా వెనుదిరిగాడు. ఇదిలా మొదటి రోజు స్టంప్స్ పడే సమయానికి భారత్ 19 ఓవర్లు ఆడి.. 4 వికెట్లను కోల్పోయి 86 పరుగులు చేసింది. ప్రస్తుతం గిల్ 32*, పంత్ 1* పరుగులతో క్రీజులో ఉన్నారు. మొదటి ఇన్నింగ్స్ లో భారత్ ప్రస్తుతం 149 పరుగుల వెనుకంజలో ఉన్నారు.