- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మూడో టెస్టు నుంచి అశ్విన్ అర్ధాంతరంగా అవుట్.. బీసీసీఐ చెప్పిన కారణమిదే !
by Swamyn |

X
దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమ్ ఇండియాకు గట్టి షాక్ తగిలింది. కీలక బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ ఈ మ్యాచ్ నుంచి వైదొలిగాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించింది. ‘‘కుటుంబంలో తలెత్తిన మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా టెస్టు జట్టు నుంచి అశ్విన్ వైదొలిగాడు. ఇలాంటి సమయంలో బీసీసీఐతోపాటు టీమ్ ఇండియా అశ్విన్‌కు, అతని కుటుంబానికి పూర్తి మద్దతుగా నిలుస్తుంది. ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యానికే బీసీసీఐ తొలి ప్రాధాన్యతనిస్తుంది. ప్రస్తుత సమయంలో అశ్విన్, అతని కుటుంబం గోప్యతను గౌరవించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం’’ అని బీసీసీఐ పేర్కొంది. కాగా, మూడో టెస్టులో బ్యాటింగ్‌లో 37 పరుగులు, బౌలింగ్‌లో ఒక వికెట్ తీసిన అశ్విన్.. జట్టుకు దూరమవడం ప్రతికూలాంశమే.
Next Story