రెండో ఇన్నింగ్స్‌లో కుప్పకూలిన ఆస్ట్రేలియా టాపార్డర్.. మ్యాజిక్ చేసిన అశ్విన్..

by Mahesh |   ( Updated:2023-02-11 08:14:05.0  )
రెండో ఇన్నింగ్స్‌లో కుప్పకూలిన ఆస్ట్రేలియా టాపార్డర్.. మ్యాజిక్ చేసిన అశ్విన్..
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్, అస్ట్రేలియా మధ్య జరుగుతున్న మొదటి వన్డేలో భారత్ పూర్తి పట్టు సాధించింది. మొదటి ఇన్నింగ్స్ లో 400 పరుగులు చేసి 223 పరుగుల ఆధిక్యంలో ఉన్న భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు టాపార్డర్‌ను దెబ్బకొట్టింది. దీంతో కేవలం 64 పరుగులకే ఆస్ట్రేలియా జట్టు 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

మూడో రోజు రెండో సెషన్ అయిన లంచ్ బ్రేక్ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టును భారత ఆల్ రౌండర్ అశ్విన్.. ఓ ఆట ఆడుకున్నాడు. కేవలం 10 ఓవర్లు మాత్రమే వేసిన అశ్విన్.. ఉస్మాన్ ఖవాజా, డేవిడ్ వార్నర్, మాట్ రెన్‌షా, పీటర్ హ్యాండ్‌సకంబు, అలిస్ కారీ (WK)లను అవుట్ చేశాడు. ఈ మ్యాచ్ లో భారత్ ఆధిపత్యం ఇలానే కొనసాగితే.. ఈ రోజే ఆట ముగిసి భారత్ విజయం సాధించే అవకాశం ఉంది.

Advertisement

Next Story