టెస్టు క్రికెట్ చరిత్రలో స్టన్నింగ్ విజయం

by Mahesh |
టెస్టు క్రికెట్ చరిత్రలో స్టన్నింగ్ విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: టెస్టు క్రికెట్ చరిత్రలో 1 పరుగు తేడాతో గెలిచిన రెండో జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది. వెల్లింగ్టన్‌లో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ ఒక పరుగు తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు 8 వికెట్ల పతనానికి 435 పరుగులు చేసి డిక్లేర్ ఇచ్చింది. కాగా అనంతరం బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 209 పరుగులకే ఆలౌట్ అయింది.

దీంతో ఇంగ్లాండ్ ఫాలో ఆన్ ఇచ్చింది. ఈ క్రమంలో బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ కు విలియమ్సన్, లాథమ్, కాన్వే, మిచెల్, టామ్ లు మంచి స్కోర్ చేయడంతో 483 పరుగులు చేసి ఇంగ్లాండ్ జట్టుకు 258 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లాడ్ జట్టు 1 పరుగు తేడాతో ఓడిపోయింది. దీంతో న్యూజిలాండ్ రెండు మ్యాచ్ సిరీస్ ను 1-1తో సమం చేసింది. దీంతో టెస్ట్ క్రికెట్‌లో 1 పరుగు తేడాతో విజయం సాధించిన రెండో జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది.

Advertisement

Next Story