క్రికెట్ లో నకిల్‌బాల్ సీక్రెట్ కనుగొన్న ఐఐటీ కాన్పూర్ విద్యార్థులు..

by Shiva |   ( Updated:2023-07-31 04:58:05.0  )
క్రికెట్ లో నకిల్‌బాల్ సీక్రెట్ కనుగొన్న ఐఐటీ కాన్పూర్ విద్యార్థులు..
X

దిశ, వెబ్ డెస్క్ : అత్యుత్తమ బ్యాట్లు, కుచించుకుపోయిన బౌండరీలు, స్ట్రోక్ ప్లేతో క్రికెట్ లో నేడు బౌలర్లపై బ్యాట్స్ మెన్ల అధిపత్యం కొనసాగుదనడంలో ఏ మాత్రం సందేహం లేదు. సాధారణంగా క్రికెట్ లో స్పిన్ బౌలర్లు అయితే ఆఫ్ బ్రేక్, లెగ్ బ్రేక్, దూస్రా, క్యారమ్ బాల్స్ తో బ్యాట్స్ మెన్ లను ఇబ్బంది పెడుతుంటారు. అదే ఫాస్ట్ బౌలర్లు ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్, లెగ్ కట్టర్, ఆఫ్ కట్టర్, యార్కర్లను సంధిస్తారు. కానీ, వాటన్నింటికీ భిన్నంగా ఫాస్ట్ బౌలర్లు నకిల్ బాల్ వేస్తారనే విషయం ఎంత మందికి తెలుసు.. చాలా మందికి తెలియదు.

ఐపీఎల్-2010లో భారత పేసర్ జహీర్ ఖాన్ దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ చార్ల్ లాంగెవెల్డ్‌ కు అలాంటి బాల్ నే వేశాడు. ఆ బాల్ గాలిలో తేలియాడుతూ అనూహ్యంగా చివరకు స్టంప్స్ ముద్దాడింది. అయితే ఆ బాల్ కు సంబంధంచి ఐఐటీ కాన్పూర్ విద్యార్థులు సాంకేతికంగా అది ఎలా సాధ్యమో కనిపెట్టారు. అదేవిధంగా భారత పేసర్లు ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్ లు ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్ మెన్ లకు ఈ నకిల్ బాల్ ను తమ ఆయుధంగా వాడారు.

Advertisement

Next Story

Most Viewed