8 స్టేడియాల్లో వన్డే వరల్డ్ కప్: వేదికలను ప్రకటించిన ఐసీసీ

by Swamyn |
8 స్టేడియాల్లో వన్డే వరల్డ్ కప్: వేదికలను ప్రకటించిన ఐసీసీ
X

దిశ, స్పోర్ట్స్: సౌతాఫ్రికా, జింబాబ్వే దేశాల్లో జరగనున్న 2027 వన్డే వరల్డ్ కప్‌ వేదికలను ఐసీసీ బుధవారం ప్రకటించింది. మొత్తం 14 జట్లు పాల్గొననున్న ఈ మెగా టోర్నీని పై రెండు దేశాల్లోని 8 స్టేడియాల్లో నిర్వహించనున్నట్టు వెల్లడించింది. జొహన్నస్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంతోపాటు, ప్రిటోరియాలోని సెంచూరియన్ పార్క్, డర్బన్‌లోని కింగ్స్‌మీడ్, క్వెబెర్హాలోని సెయింట్ జార్జ్స్ పార్క్, పార్ల్‌లోని బోలాండ్ పార్క్, కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌‌, బ్లోయిన్ఫోంటెయిన్‌లోని మాంగాంగ్‌, ఈస్ట్‌ లండన్‌లోని బఫెలో పార్క్‌ స్టేడియాల్లో మ్యాచ్‌లు జరగనున్నట్టు ఐసీసీ స్పష్టం చేసింది. కాగా, గతేడాది భారత్‌ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియా ఆరోసారి ట్రోఫీని గెలుచుకున్న విషయం తెలిసిందే.


Advertisement

Next Story

Most Viewed