- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐదేళ్ల షకీబ్ ప్రస్థానానికి నబీ బ్రేక్.. వన్డేల్లో నం.1 ఆల్‌రౌండర్‌గా..
దిశ, స్పోర్ట్స్ : వన్డే ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో ఐదేళ్ల తర్వాత కొత్త నం.1 ఆల్‌రౌండర్ దూసుకొచ్చాడు. బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ ప్రస్థానానికి ఆఫ్ఘనిస్తాన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ బ్రేక్ వేశాడు. షకీబ్‌ను వెనక్కి నెట్టి నం.1 ఆల్‌రౌండర్ అవతరించాడు. ఐసీసీ అన్ని ఫార్మాట్ల ర్యాంకింగ్స్‌ను బుధవారం ప్రకటించింది. వన్డే ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో నబీ ఒక్క స్థానాన్ని మెరుగుపర్చుకుని 314 రేటింగ్ పాయింట్స్‌తో అగ్రస్థానంలో నిలిచాడు. షకీబ్ రెండో స్థానానికి పడిపోయాడు. 2019 మేలో టాప్ పొజిషన్‌ను దక్కించుకున్న షకీబ్ దాదాపు ఐదేళ్లపాటు ఆ స్థానంలో పాతుకపోయాడు. ఇటీవల శ్రీలంకపై తొలి వన్డేలో నబీ సెంచరీతో చెలరేగడంతోపాటు ఒక్క వికెట్ తీసుకున్నాడు. దీంతో రేటింగ్ పాయింట్లు మెరుగుపర్చుకుని తాజా ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. అలాగే, 39 ఏళ్ల నబీ వన్డే ఆల్‌రౌండర్ ర్యాంకింగ్స్‌లో టాప్ పొజిషన్ సాధించిన పెద్ద వయస్కుడిగా నిలిచాడు. 2015లో శ్రీలంక మాజీ క్రికెటర్ తిలకరత్నే దిల్షాన్ 38 ఏళ్ల 8 నెలల వయసులో టాప్ ర్యాంక్ పొందిన పెద్ద వయస్కుడిగా ఉండగా తాజాగా నబీ అతన్ని అధిగమించాడు.
సిరాజ్ టాప్‌లోనే
టెస్టు, వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్ల ర్యాంక్‌ల్లో పెద్దగా మార్పులు చోటు చేసుకోలేదు. వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో బుమ్రా, కుల్దీప్ యాదవ్ చెరో ఒక్క స్థానాన్ని మెరుగుపర్చుకుని 5వ, 9వ ర్యాంక్‌లకు చేరుకున్నారు. గత టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం దక్కించుకున్న బుమ్రా టాప్ పొజిషన్‌లోనే కొనసాగుతుండగా.. జడేజా ఒక్క స్థానం కోల్పోయి 9వ ర్యాంక్‌కు పడిపోయాడు. ఆల్‌రౌండర్ విభాగంలో జడేజా, అశ్విన్ వరుసగా తొలి, రెండు స్థానాల్లో ఉన్నారు.