- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ICC Rankings : వన్డేల్లో నం.2 ర్యాంక్‌కు దూసుకొచ్చిన దీప్తి శర్మ
దిశ, స్పోర్ట్స్ : భారత స్పిన్నర్ దీప్తి శర్మ వన్డేల్లో వరల్డ్ నం.2 ర్యాంక్‌కు దూసుకెళ్లింది. మహిళల వన్డే ర్యాంకింగ్స్‌ను ఐసీసీ మంగళవారం రిలీజ్ చేసింది. తాజా ర్యాంకింగ్స్‌లో దీప్తి కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్స్(687)ను సాధించింది. ఈ క్రమంలోనే రెండు స్థానాలను ఎగబాకిన ఆమె 2వ ర్యాంక్‌కు చేరుకుంది.
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో దీప్తి రాణించింది. 3 వికెట్లు తీసిన ఆమె.. సిరీస్‌లో 3.42 ఎకానమీతో అత్యుత్తమ ప్రదర్శన చేసింది. ఈ క్రమంలోనే ఆమె ర్యాంక్ మెరుగుపడింది. అలాగే, అగ్రస్థానానికి కూడా చేరువలో ఉన్నది. ఇంగ్లాండ్ బౌలర్ సోఫీ ఎక్లోస్టోన్(770) నం.1 బౌలర్‌గా కొనసాగుతున్నది. దీప్తి తర్వాత టాప్-35 ర్యాంక్‌ల్లో మరో భారత బౌలర్ లేకపోవడం గమనార్హం. రేణుక సింగ్ 36వ ర్యాంక్‌లో, స్నేహ్ రాణా 43వ స్థానంలో ఉన్నారు.
మరోవైపు, ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లోనూ ర్యాంక్ మెరుగుపర్చుకున్న దీప్తి 3వ స్థానానికి చేరుకుంది. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో నిలకడలేమితో ఇబ్బందిపడుతున్న స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తమ ర్యాంక్‌లను కోల్పోయారు. మంధాన ఒక్క స్థానం కోల్పోయి 4వ ర్యాంక్‌కు పడిపోయింది. మూడు స్థానాలు నష్టపోయి టాప్-10లో చోటు కోల్పోయిన హర్మన్ 12వ స్థానానికి చేరుకుంది. జెమీమా రోడ్రిగ్స్ మూడు స్థానాలు అధిగమించి 30వ ర్యాంక్‌లో నిలిచింది.
- Tags
- #ICC Rankings