ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజయం.. రిటైర్మెంట్‌పై రోహిత్ శర్మ కీలక ప్రకటన

by Mahesh |   ( Updated:2025-03-10 02:29:08.0  )
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజయం.. రిటైర్మెంట్‌పై రోహిత్ శర్మ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy) విజయం తర్వాత రిటైర్మెంట్ (Retirement) పై భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Indian captain Rohit Sharma) కీలక ప్రకటన చేశారు. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచులో విజయం సాధించిన భారత్ రెండోసారి ఐసీసీ ఛాంపియన్స్‌గా నిలిచింది. కాగా ఈ ట్రోఫీ తర్వాత విరాట్ కోహ్లీ (Virat Kohli,), రోహిత్ శర్మ (Rohit Sharma)లు రిటైర్మెంట్ తీసుకుంటారని ఇందుకోసం రంగం సిద్ధం చేసుకున్నారని అనేక వార్తలు, పుకార్లు వచ్చాయి. దీంతో మ్యాచ్ విజయం తర్వాత రోహిత్ శర్మ (Rohit Sharma) ఎటువంటి ప్రకటన చేస్తాడని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.

అయితే ఈ మ్యాచ్ అనంతరం రోహిత్ మీడియాతో మాట్లాడగా.. విలేకరులు రోహిత్‌ను అతని భవిష్యత్తు ప్రణాళికల గురించి అడిగారు. ఈ ప్రశ్నకు రోహిత్ నవ్వుతూ, “కోయ్ ఫ్యూచర్ ప్లాన్ ని హై. జో చల్ రా హై వో చలేగా (భవిష్యత్ ప్లాన్ ఏమి లేదు.. ఏది జరగాలని ఉంటే అదే జరుగుద్ది)” అని అన్నారు. అలాగే తాను వన్డే ఫార్మాట్ (ODI format) నుంచి రిటైర్మెంట్ (Retirement) తీసుకుంటున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవం అని తేల్చి చెప్పారు. తాను నేను వన్డే ఫార్మాట్ నుంచి రిటైర్ తీసుకోవడం లేదని, తన రిటైర్మెంట్ (Retirement) పై ఎటువంటి పుకార్లను సృష్టించవద్దని ఈ సందర్భంగా రోహిత్ శర్మ కోరాడు.

Next Story