- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అతడికి ఇంకెన్ని అవకాశాలిస్తారు.. మాజీ టీం మేనేజర్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఆటతీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అయితే, కెప్టెన్ రోహిత్, కోచ్ రాహుల్ ద్రావిడ్ ఇద్దరూ మాత్రం అతనిపై తమకు అపార నమ్మకం ఉందని చెబుతున్నారు. కేఎల్ చాలా నాణ్యమైన ఆటగాడని కూడా కితాబిచ్చారు. వీరన్నది కూడా నిజమే. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ దేశాలన్నింట్లో రాహుల్ సెంచరీలు చేశాడు. భారత జట్టులో సెహ్వాగ్ తర్వాత ఈ ఘనత సాధించిన టెస్టు ఓపెనర్ అతనే. అందుకని రాహుల్‌ను ఎంత కాలం కొనసాగిస్తారేనేదే ప్రశ్నగా మారింది.
పరుగులు చేసినా..
ఇన్ని దేశాల్లో సెంచరీలు చేసినా కూడా ఆ తరువాతి మ్యాచుల్లో రాహుల్ రాణించలేదు. అందుకే 47 మ్యాచ్ ల తర్వాత కూడా అతని సగటు 34 మాత్రమే ఉంది. ఇదే వరుసలో ఇప్పుడు ఆస్ట్రేలియా సిరీసులో కూడా రాహుల్ చాలా పేలవంగా ఆడుతున్నాడు. అతను ఇలా చెత్త ఫామ్ లో ఉండటం ఇదేం తొలిసారి కాదు. 2018లో ఇంగ్లండ్ పర్యటనలో కూడా తొలి నాలుగు టెస్టుల్లో కూడా ఘోరంగా ఫెయిలయ్యాడు ఈ కర్ణాటక బ్యాటర్. అయినా కోహ్లీ అతనిపై నమ్మకం ఉంచి ఐదో టెస్టులో ఆడిస్తే ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ బాదాడు.
కొత్తవాడేమీ కాదుగా..
కానీ అప్పుడు పరిస్థితి వేరు. అప్పట్లో మురళీ విజయ్, శిఖర్ ధవన్ ఫామ్ కోల్పోయారు. మయాంక్ అగర్వాల్ ఇంకా రంజీల్లో దుమ్ము లేపాడు. పృథ్వీషా, శుభ్‌మన్ గిల్ ఇలా వాళ్లు చాలా చిన్న కుర్రాళ్లే. అసలు రాహులేమి కొత్త కుర్రాడు కాదుగా... అందుకని అతనికి బ్యాకింగ్ ఇవ్వడం ఓకే.. కానీ ఇప్పుడు రాహుల్ ఒక సీనియర్ ప్లేయర్ కదా. అతనికి అవకాశాలు ఇస్తూ.. తమకు ఛాన్స్ కోసం తలుపులు బద్దలు కొడుతున్న గిల్, పృథ్వీ షా వంటి వారిని ఎంత కాలం పట్టించుకోకుండా వదిలేస్తారని టీం మేనేజర్‌గా పనిచేసిన సునీల్ సుబ్రమణ్యన్ అన్నాడు.
మిగతా వాళ్లకు కూడా ఛాన్స్ ఇవ్వండి!
'అప్పట్లో శుభ్‌మన్ గిల్‌లా ఛాన్స్ కోసం తలుపులు బద్దలు కొడుతున్న ఆటగాళ్లు లేరు. ఇప్పుడు పృథ్వీ షా కూడా ఉన్నాడు. ఇలాంటి సత్తా ఉన్న వాళ్లను ఇంకెంత కాలం వదిలేస్తారు?' అని సునీల్ నిలదీశాడు. ఈ క్రమంలో మూడో టెస్టులో కూడా రాహుల్‌నే టీమిండియా ఆడిస్తుందా? లేక గిల్‌కు ఛాన్స్ ఇస్తుందా? అనేది ఆసక్తిగా మారింది. గిల్‌ను ఆడిస్తారని పలువురు మాజీలు అంటున్నారు కానీ.. రోహిత్ కానీ, ద్రావిడ్ కానీ ఈ విషయంలో ఎలాంటి ప్రకటన చెయ్యలేదు. దీంతో రాహుల్‌కు మరో అవకాశం ఇస్తారేమో? అని అభిమానులు అంటున్నారు.
- Tags
- KL Rahul