India vs New Zealand 3rd Test : మూడో టెస్టుకు పిచ్ ఎలా ఉండబోతుందో ?

by Y. Venkata Narasimha Reddy |
India vs New Zealand 3rd Test : మూడో టెస్టుకు పిచ్ ఎలా ఉండబోతుందో ?
X

దిశ, వెబ్ డెస్క్ : న్యూజిలాండ్(New Zealand) తో టీమిండియా( Team India)మూడు టెస్టుల సిరీస్ లో ఆఖరీదైన మూడో టెస్టు(3rd Test) కోసం ముంబై వాంఖడే స్టేడియం(Mumbai Wankhede Stadium) లో పిచ్ ను ఎలా సిద్ధం చేస్తున్నారన్నది క్రీడాభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. నవంబర్ 1 నుంచి వాంఖడే స్టేడియంలో మూడో టెస్టు ప్రారంభం కానుంది. స్వదేశంలో పులులుగా పిలుచుకునే టీమిండియా మూడు టెస్టుల సిరీస్ లో కివీస్ ను చిత్తు చేసి సిరీస్ సాధిస్తుందన్న అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వరుసగా రెండు టెస్టు మ్యాచ్ లలోనూ టీమిండియా పరాజయం పాలైంది. దీంతో సర్వత్రా విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా మూడో టెస్టులోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని, డబ్ల్యుటీసీ ఫైనల్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని భావిస్తోంది. ఇందుకు ప్రధానంగా మూడో టెస్టు జరిగే వాంఖడే పిచ్ రూపకల్పనపై ఫోకస్ పెట్టారు. బెంగళూరు, పుణె టెస్టుల్లో మొదటిరోజు నుంచే పిచ్ స్పిన్నర్లకు సహకరించింది. దీనిని దృష్టిలో ఉంచుకొని వాంఖడే పిచ్ ను భిన్నంగా రూపొందిస్తున్నారని తెలుస్తోంది. పిచ్ మొదటిరోజు నుంచే బ్యాటర్లకు అనుకూలించేలా, రెండో రోజు నుంచి స్పిన్నర్లకు సహకరించేలా తయారుచేస్తున్నారని సమాచారం.

ఇప్పటికే బీసీసీఐ చీప్ పిచ్ క్యూరేటర్ ఆశిశ్ బౌమిక్ తోపాటు ఎలైట్ ప్యానెల్ క్యూరేటర్ తపోష్ ఛటర్జీ పిచ్ గురించి సమీక్షించేందుకు వాంఖడే క్యూరేటర్ రమేశ్ మముంకర్ ను కలిసి చర్చించారు. ఇది స్పోర్టింగ్ ట్రాక్ అని, ప్రస్తుతం పిచ్ పై కొంచెం పచ్చిక ఉందని, మొదటిరోజు బ్యాటింగ్ అనుకూలిస్తుందని అంచనా వేస్తున్నామని, రెండోరోజు నుంచి స్పిన్నర్లకు సహకరిస్తుందని భావిస్తున్నామని సంబంధిత వర్గాలు తెలిపాయి.

వాంఖడే స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ చివరగా 2021 డిసెంబరులో తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో టీమ్ ఇండియా 325 పరుగులకు ఆలౌటైంది. మొత్తం పది వికెట్లు స్పిన్నర్ ఆజాజ్ పటేల్ కే దక్కాయి. అనంతరం అశ్విన్ (4/8), సిరాజ్ (3/19), అక్షర్ పటేల్ (2/14) ధాటికి కివీస్ 62 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 276/7 వద్ద డిక్లేర్ చేసింది. ఆజాజ్ పటేల్ 4, రచిన్ రవీంద్ర 3 వికెట్లు తీశారు. 540 పరుగులతో బరిలోకి దిగిన కివీస్ 167 పరుగులకే కుప్పకూలింది. భారత స్పిన్నర్లు అశ్విన్, జయంత్ యాదవ్ చెరో నాలుగు వికెట్లు సాధించడంతో భారత్ విజయం సాధించింది. అయితే ఈ ధఫా వాంఖడే పిచ్ ఎలా స్పందిస్తుందో టీమిండియా బ్యాటర్లు, స్పిన్నర్లు ఎలా రాణిస్తారు..అటు కివీస్ మూడు టెస్టుల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేస్తుందా చుడాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed