- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్.. థాయిలాండ్‌పై ఘన విజయం
సలాలా : ఒమన్‌లో జరుగుతున్న పురుషుల జూనియర్ హాకీ ఆసియా కప్‌లో భారత్ సెమీస్‌కు దూసుకెళ్లింది. పూల్-ఏలో భాగంగా ఆదివారం రాత్రి జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో థాయిలాండ్‌పై 17-0 తేడాతో విజయం సాధించడంతో టీమ్ ఇండియా సెమీస్ బెర్త్‌ను కన్ఫార్మ్ చేసుకుంది. అలాగే, తొలి రౌండ్‌లో 10 పాయింట్లతో టాప్-3 జట్లలో చోటు దక్కించుకోవడంతో ఈ ఏడాది చివర్లో జరిగే ఎఫ్‌ఐహెచ్ జూనియర్ వరల్డ్ కప్‌కు కూడా అర్హత సాధించింది. ఇక, మ్యాచ్ విషయానికొస్తే.. భారత్ పూర్తి ఆధిపత్యంతో ఏకపక్షంగా గెలుచుకుంది.
అన్గద్ సింగ్(13, 33, 47, 55) నాలుగు గోల్స్‌తో జట్టు విజయం కీలక పాత్ర పోషించగా.. ఉత్తమ్(24, 31), అమన్‌దీప్(26, 29) రెండేసి గోల్స్‌తో సత్తాచాటారు. రావత్(17), అరైజీత్(36), విష్ణుకాంత్(38), ధామి బాబీ(45), శారద నంద్(46), అమన్‌దీప్(47), రోహిత్(49), సునిత్(54), రాజిందర్(56) చెరో గోల్‌తో రాణించడంతో భారత్‌కు తిరుగులేని విజయం దక్కింది. టీమ్ ఇండియా ఎటాకింగ్ ముందు థాయిలాండ్ డిఫెన్స్ పూర్తి తేలిపోయింది. ఆ జట్టు ఒక్కటంటే ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. పూల్-ఏ పాయింట్స్ టేబుల్‌లో భారత్ 10 పాయింట్లతో నాకౌట్‌కు చేరుకున్న తొలి జట్టుగా నిలిచింది.