భారత మహిళా హాకీ జట్టుకు నిరాశా.. ఆస్ట్రేలియా చేతిలో ఓటమి..

by Vinod kumar |
భారత మహిళా హాకీ జట్టుకు నిరాశా.. ఆస్ట్రేలియా చేతిలో ఓటమి..
X

అడిలైడ్: ఆస్ట్రేలియా పర్యటనను భారత మహిళా హాకీ జట్టు నిరాశా.. ఆస్ట్రేలియా చేతిలో ఓటమి..జనకంగా ప్రారంభించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారమిక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 2-4తో ఆతిథ్య జట్టు చేతిలో ఓటమిపాలైంది. తొలి క్వార్టర్ తర్వాత వరల్డ్ నంబర్ 3 ఆస్ట్రేలియా జట్టు ఆరు నిమిషాల్లో రెండు గోల్స్ సాధించింది. మూడో క్వార్టర్‌లో మరో రెండు గోల్స్ చేసింది.

ఇక వరల్డ్ నంబర్ 8 భారత జట్టుకు సంగీత కుమారి (29వ నిమిషంలో), షర్మిలా దేవి (40వ నిమిషంలో) గోల్స్ అందించారు. ఇక రెండో మ్యాచ్ శనివారం ఇదే వేదికలో జరుగుతుంది. ఈ పర్యటనలో భారత జట్టు ఆస్ట్రేలియా-ఎ జట్టుతోనూ రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. ఆసియన్ గేమ్స్‌కు సన్నాహంగా భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఈ టోర్నీ చైనాలోని హాంగ్‌ఝౌలో సెప్టెంబర్‌లో జరగనుంది.

Advertisement

Next Story

Most Viewed