HCA: గ్రామాల్లోని క్రీడాకారులకు హెచ్‌సీఏ గుడ్ న్యూస్.. త్వరలో మెగా సమ్మర్ క్రికెట్ క్యాంపులు

by Shiva |
HCA: గ్రామాల్లోని క్రీడాకారులకు హెచ్‌సీఏ గుడ్ న్యూస్.. త్వరలో మెగా సమ్మర్ క్రికెట్ క్యాంపులు
X

దిశ, వెబ్‌డెస్క్: ‘క్రికెట్’ కోట్లాది మంది భారత ప్రజలకు ఓ జంటిల్‌మెన్ గేమ్. ప్రతి యువకుడు తాను దేశం తరఫున ఆడి ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కంటాడు. కానీ, అర్థిక పరిస్థితుల కారణంగా కావాల్సిన సౌకర్యాలు, క్రీడా సామగ్రి అందుబాటులో లేక చాలామంది యువతకు అందుబాటులో ఉండవు. ఈ క్రమంలోనే హైదరాబాద్ క్రికెట్ ఆసోసియేషన్ (HCA) గ్రామీణ క్రీడాకారులకు గుడ్ న్యూస్ చేప్పింది. పేద కుటుంబాల్లో నుంచి వచ్చి క్రికెట్‌లో ఉత్తమ ప్రతిభను కనబరుస్తున్న క్రీడాకారుల ఉచిత శిక్షణ కొరకు 25 కేంద్రాల్లో 30 రోజుల పాటు సమ్మర్ క్రికెట్ క్యాంపులు నిర్వహించనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ క్రికెట్ ఆసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ రావు మాట్లాడుతూ.. ప్రతి జిల్లాకు 15 లక్షల నిధులిచ్చి, ప్రతి జిల్లాలో 3 క్యాంపులు నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ఉన్న మట్టిలోని మాణిక్యాలను వెలికితీయడానికి సమ్మర్ క్రికెట్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒక వేళ జిల్లాలో కోచ్‌లు, ఫిజియోలు లేకపోయినా.. హెచ్‌సీఏ తరుఫున వారిని కూడా గ్రామలకు పంపుతామని తెలిపారు.

Advertisement

Next Story