- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫిబ్రవరి 18న హెచ్‌సీఏ ఏజీఎం : హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు
దిశ, తెలంగాణ బ్యూరో : ఫిబ్రవరి 18న ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఏం) నిర్వహించనున్నట్టు అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌మోహన్ రావు వెల్లడించారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2018 నుంచి దాదాపుగా ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న అకౌంట్స్‌ను పరిశీలించి ఆమోదించినట్టు తెలిపారు. అలాగే, అంబుడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్ నియామకం, జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిటీ సిఫార్సులను అమలు చేయడం వంటి కీలక విషయాలను చర్చించనున్నట్టు చెప్పారు. హెచ్‌సీఏ స్టాండింగ్ కమిటీలతోపాటు క్రికెట్ కమిటీలను కూడా భర్తీ చేస్తామన్నారు. బీసీసీఐతో పాటు ఇతర క్రికెట్ సమావేశాల్లో హెచ్‌సీఏ ప్రతినిధిగా పాల్గొనే వ్యక్తిని ఏజీఎంలో నిర్ణయిస్తామని తెలిపారు.
హర్షా భోగ్లేకు ‘క్రికెట్ బిర్యానీ’ పుస్తకం బహూకరణ
ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లేకు పీఆర్ మాన్‌సింగ్ రాసిన ‘క్రికెట్ బిర్యానీ’ పుస్తకాన్ని హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు బహూకరించారు. హైదరాబాద్ క్రికెట్ చరిత్ర, వారసత్వంతోపాటు క్రికెట్‌తో ఇక్కడున్న లక్షల మంది అభిమానులకు పెనవేసుకున్న బంధాన్ని ఈ పుస్తకం తెలియజేస్తుందని వివరించారు.
- Tags
- #HCA