కమ్ బ్యాక్ కోసం పాండ్యా వర్కౌట్స్.. (వీడియో)

by Swamyn |   ( Updated:2024-06-01 14:39:35.0  )
కమ్ బ్యాక్ కోసం పాండ్యా వర్కౌట్స్.. (వీడియో)
X

దిశ, స్పోర్ట్స్ : వన్డే ప్రపంచకప్‌లో గాయపడిన టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్‌నెస్ సాధించేందుకు శ్రమిస్తున్నాడు. గాయం కారణంగా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు దూరమైన ఈ స్టార్ ఆల్‌రౌండర్.. సౌతాఫ్రికా పర్యటనకు కూడా అందుబాటులో లేడు. దాంతో అతని ఫిట్‌నెస్‌పై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నెలలో ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌ కూడా అతను ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. ఐపీఎల్ నాటికి అతను అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. అయితే, కమ్ బ్యాక్ ఇచ్చేందుకు పాండ్యా తీవ్రంగానే ప్రయత్నిస్తున్నాడు. మంగళవారం ఇన్‌స్టాగ్రమ్‌లో పాండ్యా తన జిమ్ సెషన్ వీడియోను పోస్టు చేశాడు. దీనికి ‘ప్రొగ్రెస్.. ఎవర్రీ డే’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ వీడియోలో పాండ్యా వివిధ రకాల ఎక్సర్‌సైజులు చేశాడు. ఈ వీడియోను చూసిన భారత అభిమానులు, ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. పాండ్యా త్వరగా ఫిట్‌నెస్ సాధించి ఐపీఎల్ ఆడాలని కోరుకుంటున్నారు. కాగా, ఇటీవల ఐపీఎల్ వేలానికి ముందు ట్రేడింగ్ విండో ద్వారా పాండ్యా గుజరాత్ టైటాన్స్‌ను వీడి తిరిగి ముంబైకి గూటికి చేరిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కెప్టెన్‌గా రోహిత్‌ శర్మను తప్పించి పాండ్యాకు పగ్గాలు అప్పగించింది.

Advertisement

Next Story