Harbhajan Singh: విండీస్‌తో తొలి టెస్ట్.. ఆ ఇద్దరికీ నో ఛాన్స్‌! ఆంధ్ర ప్లేయర్‌ ఛాన్స్

by Vinod kumar |
Harbhajan Singh: విండీస్‌తో తొలి టెస్ట్.. ఆ ఇద్దరికీ నో ఛాన్స్‌! ఆంధ్ర ప్లేయర్‌ ఛాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: Harbhajan Singh: విండీస్‌తో తొలి టెస్ట్.. ఆ ఇద్దరికీ నో ఛాన్స్‌! ఆంధ్ర ప్లేయర్‌ ఛాన్స్దుకు టీమిండియా అన్ని విధాల సిద్దమైంది. 10 రోజుల ముందే కరీబియన్‌ గడ్డపై అడుగు పెట్టిన రోహిత్‌ సేన.. ఈ సిరీస్‌ కోసం తీవ్రంగా శ్రమించింది. డబ్ల్యూటీసీ సైకిల్‌ 2023-25లో తొలి విజయమే లక్ష్యమే భారత జట్టు బరిలోకి దిగనుంది. ఈ క్రమంలో విండీస్‌తో తొలి టెస్టుకు టీమిండియా ప్లేయింగ్‌ ఎలెవన్‌ను భారత మాజీ స్పిన్నర్‌ హర్భజన్ సింగ్ ఎంచుకున్నాడు. హర్భజన్ సింగ్ ఎంచుకున్న జట్టులో ఆల్ రౌండర్లు శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్‌కు చోటు దక్కలేదు.

అదే విధంగా యువ ఆటగాడు యశస్వీ జైశ్వాల్‌కు భజ్జీ చోటిచ్చాడు. మరోవైపు వికెట్‌ కీపర్‌గా కిషన్‌కు కాకుండా ఆంధ్ర వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ శ్రీకర్‌ భరత్‌ వైపే భజ్జీ మొగ్గు చూపాడు. వెస్టిండీస్‌తో జరిగే తొలి టెస్టులో భారత ఇన్నింగ్స్‌ను రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌ ప్రారంభించాలి.

మూడో స్ధానంలో యువ ఆటగాడు జైశ్వాల్‌కు అవకాశం ఇవ్వాలి. అయితే చాలా మంది ఓపెనర్‌గా గిల్‌ను కాకుండా జైశ్వాల్‌ను పంపాలని అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే గిల్‌ ఓపెనర్‌ వచ్చి ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. అతడు ఆ స్ధానాన్ని పదిలం చేసుకున్నాడు. కాబట్టి అతడి స్ధానాన్ని మార్చి ఏకగ్రాతను దెబ్బ తీయవద్దు. ఇక నాలుగు, ఐదు స్ధానాల్లో వరుసగా కోహ్లి, రహానే బ్యాటింగ్‌కు వస్తారు.

అందులో ఎటువంటి మార్పు ఉండదు. ఇక ఆరో స్థానంలో రవీంద్ర జడేజా వస్తాడన్నాడు. ఏడో నెంబర్‌లో కేఎస్ భరత్ లేదా అశ్విన్ ఆడతారు. అదే విధంగా దేశీవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించిన జయదేవ్‌ ఉనద్కట్‌కు అవకాశం ఇవ్వాలి. జట్టులో ఐదో పేసర్‌గా ముఖేష్‌ కుమార్‌ను తీసుకోవాలి అని చెప్పుకొచ్చాడు.

హర్భజన్ ఎంచుకున్న టీమ్ ఇండియా జట్టు:

రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శ్రీకర్ భరత్, మహమ్మద్ సిరాజ్, జయదేవ్ ఉనద్కత్, ముఖేష్ కుమార్

Advertisement

Next Story

Most Viewed