బీసీసీఐ ఖాతాకు గోల్డెన్ టిక్ తొలగింపు..

by Vinod kumar |
బీసీసీఐ ఖాతాకు గోల్డెన్ టిక్ తొలగింపు..
X

న్యూఢిల్లీ : బీసీసీఐ అఫీషియల్ ఎక్స్(ట్విటర్) ఖాతా గోల్డెన్ టిక్ మార్క్ మాయమైంది. ఆదివారం భారత్, విండీస్ జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ ప్రారంభానికి ముందు బీసీసీఐ అకౌంట్‌ వేరిఫికేషన్ మార్క్‌ను ట్విటర్ తొలగించింది. దాంతో బీసీసీఐ ఖాతాకు గోల్డెన్ టిక్ లేకపోవడంతో భారత అభిమానులు గందరగోళానికి గురయ్యారు. బీసీసీఐ వేరిఫికేషన్ మార్క్‌ను తొలగించడానికి కారణం అకౌంట్ డీపీని మార్చడమే.

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘హర్ ఘర్ తిరంగ అభియాన్’లో భాగంగా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ తమ డీపీని త్రివర్ణ పతాకంతో మార్చుకోవాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. దాంతో బీసీసీఐ తమ ట్విటర్ ఖాతా డీపీని మువ్వన్నెల జెండాగా మార్చింది. కాసేపటికే ట్విటర్ బీసీసీఐ గోల్డెన్ టిక్ మార్క్‌ను తొలగించి షాకిచ్చింది. ట్విటర్ రూల్స్ ప్రకారం.. డీపీ మార్చితే ఆ అకౌంట్ వేరిఫికేషన్ మార్క్‌ను సంస్థ తొలగిస్తుంది. ఆ అకౌంట్‌ను మళ్లీ పరిశీలించిన తర్వాతే ఆ మార్క్‌ను పునరుద్ధరిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed