Rishabh Pant చెత్త షాట్ పట్ల మాజీ క్రికెటర్ల అసహనం..

by Vinod kumar |   ( Updated:2022-09-05 14:40:58.0  )
Rishabh Pant చెత్త షాట్ పట్ల మాజీ క్రికెటర్ల అసహనం..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియా కప్ 2022 గ్రూప్ దశని అజేయంగా ముగించిన టీమిండియాకి సూపర్-4లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ఓటమి రుచి చూపింది. దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్‌పై 5 వికెట్ల తేడాతో పాక్ గెలిచింది. అయితే ఈ మ్యాచ్‌లో చెత్త షాట్‌కు రిషబ్ పంత్ ఓట్ అయిన సంగతి తెలిసిందే. రిషబ్ షాట్ సెలక్షన్‌ను పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్, భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తీవ్రంగా తప్పు పట్టారు. కోహ్లీ మరో ఎండ్‌లో స్థిరపడి ఆడుతుండగా.. రిషబ్ పంత్‌ అవతలి ఎండ్‌లో హిట్టింగ్‌ను కొనసాగించడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. అతను పాయింట్ రీజియన్‌లో స్విచ్ హిట్ ఆడేందుకు ప్రయత్నించగా పాయింట్‌లో ఫీల్డర్ క్యాచ్ అందుకున్నాడు. పాక్ లెగ్ స్పిన్నర్ షాదాబ్ ఖాన్ తెలివిగా బౌలింగ్ చేసి పంత్‌ను దెబ్బతీశాడు.

రిషబ్ పంత్ ఔటైన విధానం సోషల్ మీడియాలోనూ బాగా విమర్శలకు గురయింది. ఆ షాట్‌ను లాంగ్ ఆన్ లేదా డీప్ మిడ్ వికెట్ మీద కొట్టాల్సిందని.. కానీ ఈ టైంలో ఆ షాట్ ఆడడం సరికాదని గంభీర్ అన్నారు. పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ కూడా గౌతమ్ గంభీర్ వ్యాఖ్యలను సమర్థించారు. మిడిల్ ఓవర్లలో స్విచ్ హిట్‌ను ఆడకుండా పంత్ ఉండాల్సిందని చెప్పారు. టెస్టు క్రికెట్‌లో అతను ఆ షాట్ ఆడతాడని నాకు తెలుసు.. కానీ ఈ దశలో ఇలాంటి షాట్ అవసరం లేదు అని వసీం అక్రమ్ చెప్పాడు.

Advertisement

Next Story

Most Viewed