ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ తర్వాత.. ఆసియా కప్‌పై నిర్ణయం: జయ్ షా

by Vinod kumar |
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ తర్వాత.. ఆసియా కప్‌పై నిర్ణయం: జయ్ షా
X

న్యూఢిల్లీ: గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కు బంగ్లాదేశ్, అఫ్ఘానిస్తాన్, శ్రీలంక క్రికెట్ బోర్డుల అధ్యక్షులు హాజరవుతారని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు జయ్ షా తెలిపారు. నరేంద్ర మోడీ స్టేడియంలో ఆదివారం జరిగే ఐపీఎల్ మ్యాచ్ తర్వాత ఆసియా కప్ పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆసియా కప్-2023కు పాకిస్తాన్ ఆతిథ్యమిస్తే ఆ టోర్నీని బహిష్కరిస్తామని జయ్ షా గతేడాది ప్రకటించారు.

అయితే.. ఆసియా కప్ గురించి ఏం చేయాలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ తర్వాత చర్చిస్తామన్నారు. ఆసియా కప్ టోర్నమెంట్ ను పాకిస్తాన్ వెలుపల నిర్వహించే బీసీసీఐ ప్రతిపాదనకు శ్రీలంక, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులు ఇప్పటికే మద్దతిచ్చాయి. ఆసియా కప్ ను తమ దేశంలో నిర్వహించడంపై తలెత్తిన వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించడానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నజమ్ సేథి కూడా అంగీకరించారు.

Advertisement

Next Story