French Open 2024: రెండో రౌండ్లోకి సింధు, శ్రీకాంత్

by Swamyn |
French Open 2024: రెండో రౌండ్లోకి సింధు, శ్రీకాంత్
X

దిశ, స్పోర్ట్స్: ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ శుభారంభం చేశారు. బుధవారం జరిగిన సింగిల్స్‌లో విజయం సాధించి రెండో రౌండ్‌లోకి ప్రవేశించారు. పురుషుల సింగిల్స్‌లో తైవాన్ ప్లేయర్ చో టీన్ చెన్‌పై శ్రీకాంత్ 21-15, 20-22, 21-8తో విజయం సాధించాడు. తొలి గేమ్‌లో శ్రీకాంత్ పైచేయి సాధించగా, రెండో గేమ్‌లో చో టీన్ పుంజుకుని గట్టిపోటిచ్చాడు. అయితే, చివరి గేమ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన శ్రీకాంత్.. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశమివ్వలేదు. ఇక, మహిళల సింగిల్స్‌లో కెనెడియన్ క్రీడాకారిణిపై సింధు 20-22, 22-20, 21-19 తేడాతో గెలుపొందింది. ప్రతి గేమ్‌లోనూ నువ్వా-నేనా అన్నట్టు తలపడిన వీరిలో చివరికి సింధు పైచేయి సాధించింది. మొత్తానికి సింధు, శ్రీకాంత్ తొలి రౌండ్‌లో నెగ్గి, రెండో రౌండ్‌లోకి ప్రవేశించగా, మరో భారత ఆటగాడు ప్రణయ్ మాత్రం నిరాశపర్చాడు. మెన్స్ సింగిల్స్‌లో చైనీస్ ప్లేయర్.. లు గువాంగ్ జు చేతిలో 21-17, 21-17తో ఓటమిపాలయ్యాడు.


Advertisement

Next Story