- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Paris Olympics : ఆ పోటీలు పారిస్‌కు 16 వేల కిలోమీటర్ల దూరంలో..
దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్ క్రీడలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. విశ్వక్రీడలకు ఆతిథ్యమివ్వడానికి పారిస్ అన్ని రకాలుగా ముస్తాబైంది. అయితే, ఓ క్రీడా ఈవెంట్ మాత్రం పారిస్‌కు దాదాపు 16 వేల కిలోమీటర్ల దూరంలో నిర్వహిస్తుండటం గమనార్హం. సర్ఫింగ్ ఈవెంట్‌ను పసిఫిక్ మహా సముద్రంలో ఉన్న ఫ్రెంచ్ పాలినేషియన్ ద్వీపం తాహితీలోని ఓ చిన్న గ్రామం టీహుపో ఓ తీరంలో నిర్వహించనున్నారు. ఇది పారిస్‌కు 15.715 కిలో మీటర్ల దూరంలో ఉన్నది. ఒలింపిక్స్ చరిత్రలో 68 ఏళ్లలో ఓ క్రీడను ఆతిథ్య నగరానికి ఇంత దూరంలో నిర్వహించడం ఇదే తొలిసారి.
పారిస్‌కు సమీపంలో సముద్రం లేదు. అయితే, ఫ్రెంచ్ పాలినేషియన్ ఫ్రాన్స్‌లో భాగమే. ప్రపంచంలో టీహుపో ఓ తీరం అత్యుత్తమ అలలకు పేరుగాంచింది. అందుకే, నిర్వాహకులు సర్ఫింగ్ ఈవెంట్‌ను అక్కడ నిర్వహించనున్నారు. సర్ఫింగ్‌తోపాటు సెయిలింగ్ ఈవెంట్, ఫుట్‌బాల్ మ్యాచ్‌లు కూడా పారిస్‌కు దూరంగా మార్సెయిల్స్, బోర్డియక్స్‌లో జరగనున్నాయి. ఇవి పారిస్‌కు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. గతంలో ఆతిథ్య నగరానికి దూరంలో క్రీడలను నిర్వహించడం ఒలింపిక్స్‌లో ఇదే తొలిసారి కాదు. 1956లో మెల్‌బోర్న్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో ఈక్వెస్ట్రియన్ పోటీని స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో నిర్వహించారు.
- Tags
- #Paris Olympics