భారత హాకీ జట్లకు ఓటమి

by Harish |
భారత హాకీ జట్లకు ఓటమి
X

దిశ, స్పోర్ట్స్ : ఎఫ్‌ఐహెచ్ హాకీ ప్రొ లీగ్ టోర్నీలో భాగంగా యూరోప్ పర్యటనకు వెళ్లిన భారత పురుషుల, మహిళల హాకీ జట్లకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. హర్మన్‌ప్రీత్ నేతృత్వంలోని పురుషుల జట్టు వరుసగా రెండో ఓటమిని పొందింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సేన 2(1)-2(3) తేడాతో బెల్జియం చేతిలో షూటౌట్‌లో పరాజయం పాలైంది. మొదట అరైజీత్ సింగ్, సుఖ్‌జీత్ సింగ్ చెరో గోల్ చేయడంతో భారత్ 2-2తో బెల్జియంతో సమంగా నిలిచింది. అయితే, షూటౌట్‌లో నాలుగు ప్రయత్నాల్లో భారత జట్టు ఒకే గోల్ చేయగా.. బెల్జియం మూడు గోల్స్ చేసి విజయం సాధించింది. మరోవైపు, సలీమా సారథ్యంలోని మహిళల జట్టు హ్యాట్రిక్ ఓటమిని చవిచూసింది. బెల్జియం చేతిలో 2-1 తేడాతో ఓడిపోయింది. భారత్ తరపున కుమారి సంగీత ఏకైక గోల్ చేసింది. ఈ టూరులో భారత పురుషుల, మహిళల జట్లకు బెల్జియం చేతిలో ఇది వరుసగా రెండో ఓటమి. ఆదివారం అర్జెంటీనా జట్లతో భారత జట్లు తలపడనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed