- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- వీడియోలు
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
తుది మెట్టుపై భారత్ బోల్తా.. ఫైనల్‌లో నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
దిశ, స్పోర్ట్స్ : ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్(ఎఫ్‌ఐహెచ్) ప్రారంభ హాకీ 5s వరల్డ్ కప్‌లో టైటిల్ ఆశలు రేపిన భారత మహిళల జట్టు తుది మెట్టుపై బోల్తా పడింది. మస్కట్‌లో శనివారం రాత్రి జరిగిన ఫైనల్‌లో భారత్ 2-7 తేడాతో నెదర్లాండ్స్ చేతిలో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. డచ్ ప్లేయర్లు వరుస గోల్స్‌తో భారత్‌పై తీవ్ర ఒత్తిడి పెంచారు. ఫస్టాఫ్‌లో భారత్ ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. నెదర్లాండ్స్ 6-0తో ఫస్టాఫ్‌లోనే మ్యాచ్‌పై పట్టు సాధించింది. సెకండాఫ్‌లో భారత్ తరపున జ్యోతి 20వ నిమిషంలో గోల్ చేసి ఖాతా తెరవగా.. కాసేపటికే 23వ నిమిషంలో రుతుజ జట్టుకు రెండో గోల్ అందించింది. భారత్ పుంజుకోవడం అప్పటికే ఆలస్యమైంది.చివరి వరకూ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన నెదర్లాండ్స్ ప్రారంభ హాకీ 5sవరల్డ్ కప్ టైటిల్‌ను ఎగురేసుకపోయింది. వాన్ డె వెన్నె జన్నెకె, వాన్ డెర్ వెల్డ్ట్ బెంటె, కాల్సే లానా రెండేసి గోల్స్‌తో నెదర్లాండ్స్ విజయంలో కీలక పాత్ర పోషించారు.