పాక్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ షాక్.. ఆ నగరాల్లో చాంపియన్స్ ట్రోఫీ టూరు రద్దు

by Harish |
పాక్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ షాక్.. ఆ నగరాల్లో చాంపియన్స్ ట్రోఫీ టూరు రద్దు
X

దిశ, స్పోర్ట్స్ : వివాదాస్పద పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో చాంపియన్స్ ట్రోఫీ టూరు‌ నిర్వహించాలని చూసిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) గట్టి షాక్ ఇచ్చింది. పీవోకే‌లో టోర్నీ టూరును రద్దు చేసింది. పీసీబీ నిర్ణయం తీసుకున్న మరుసటి రోజే ఐసీసీ షాక్ ఇవ్వడం గమనార్హం. పాక్ క్రికెట్ బోర్డు ఈ నెల 16 నుంచి 24 వరకు చాంపియన్స్ ట్రోఫీ టూరుకు ప్లాన్ చేసింది. నేడు ఇస్లామాబాద్‌లో ఈ కార్యక్రమం ప్రారంభంకానుంది. అందులో భాగంగా పీవోకేలో భాగమైన స్కర్దు, ముర్రీ, ముజఫరాబాద్‌లో కూడా ట్రోఫీని ప్రదర్శిస్తామని పీసీబీ వెల్లడించింది. దీనిపై బీసీసీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లగా.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఆ నగరాల్లో ట్రోఫీ టూరును రద్దు చేసింది. వచ్చే ఏడాది జరగబోయే చాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన షెడ్యూల్‌ను ఇంకా ప్రకటించలేదు. పాక్‌కు భారత జట్టును పంపించబోమని బీసీసీఐ స్పష్టం చేయడం, హైబ్రిడ్ మోడల్‌కు పీసీబీ ఒప్పుకోకపోవడంతో టోర్నీపై నీలినీడలు కమ్ముకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed