ప్రపంచ కప్ ఆడనున్న England Team ఇదే..

by Hajipasha |   ( Updated:2022-09-02 10:59:13.0  )
ప్రపంచ కప్ ఆడనున్న England Team ఇదే..
X

దిశ, వెబ్‌డెస్క్: ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నీకి సిద్దమవుతూనే జట్లను కూడా ప్రకటిస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో ఈ ఏడాది అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు టోర్నీ జరుగనుంది. మొత్తం 45 మ్యాచ్‌లు ఉండగా.. టీమిండియా మొదటి మ్యాచ్‌ పాకిస్తాన్‌తో ఆడనుంది. ఇదిలా ఉంటే ఈ ప్రతిష్టాత్మక వరల్డ్ కప్ కోసం ఇంగ్లాండ్ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. జోస్ బట్లర్ కెప్టెన్సీతో కూడిన జట్టును ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది.

ఇంగ్లాండ్ టీ20 ప్రపంచ కప్ జట్టు: జోస్ బట్లర్ (సి), మోయిన్ అలీ, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, రీస్ టోప్లీ, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్ , మార్క్ వుడ్

Also Read :ఆసియా కప్ నుంచి ఆ దేశం ఔట్.. సూపర్ 4కి శ్రీలంక..

Advertisement

Next Story