ప్రపంచ కప్ 2023 ENG vs BAN.. నిలకడగా రాణిస్తున్న ఇంగ్లాండ్

by Mahesh |   ( Updated:2023-10-10 06:05:50.0  )
ప్రపంచ కప్ 2023 ENG vs BAN.. నిలకడగా రాణిస్తున్న ఇంగ్లాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: వన్డే ప్రపంచ కప్ 2023లో భాగంగా 7వ మ్యాచ్ ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకోవడంతో ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేస్తుంది. ఇరు జట్లు తాము ఆడిన మొదటి మ్యాచ్ లో ఘోర పరాజయం చవిచూడటంతో ఈ మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించాలనే కోరికతో ఉన్నాయి. ఈ క్రమంలో మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ గా మారే అవకాశం ఉంది. కాగా మొదట బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లాండ్ జట్టు 11 ఓవర్లకు వికెట్లేమి కోల్పోకుండా 74 పరుగులతో నిలకడగా రాణిస్తుంది.

ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్(w/c), లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, రీస్ టాప్లీ

బంగ్లాదేశ్ (ప్లేయింగ్ XI): తాంజిద్ హసన్, లిటన్ దాస్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్(సి), మెహిదీ హసన్ మిరాజ్, ముష్ఫికర్ రహీమ్(w), తౌహిద్ హృదయ్, మహేదీ హసన్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మాన్

Advertisement

Next Story

Most Viewed