- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Jammu & Kashmir : కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఆర్మీ ఆఫీసర్ మృతి
దిశ, నేషనల్ బ్యూరో : జమ్ము కశ్మీర్‌లోని కిష్ట్‌వార్‌లో జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక ఆర్మీ ఆఫీసర్ మృతి చెందగా.. మరో ముగ్గురు సోల్జర్లు గాయపడ్డారు. ఈ మేరకు ఆర్మీ 16 కార్ప్ విభాగం ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. శనివారం కిష్ట్‌వార్‌లోని భర్త్ రిడ్జ్‌లో జాయింట్ కౌంటర్ టెర్రర్ ఆపరేషన్ కొనసాగుతుండగా జూనియర్ కమిషన్‌డ్ ఆఫీసర్ నాయబ్ సుబేదార్ రాకేష్ కుమార్ మృతి చెందినట్లు తెలిపింది. నాయబ్ సుబేదార్ 2 పారా(ఎస్ఎఫ్)లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇటీవల ఇద్దరు డిఫెన్స్ గార్డులను గ్రామ సమీపంలో చంపడంతో ఆర్మీ యాంటీ టెర్రర్ ఆపరేషన్‌ను ప్రారంభించింది. ఉదయం 11 గంటలకు ఆర్మీ, పోలీసులు టెర్రరిస్టుల కోసం గాలిస్తుండగా.. ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కొన్ని కిలో మీటర్ల దూరంలో విలేజ్ డిఫెన్స్ గార్డులు నజీర్ అహ్మద్, కుల్దీప్ కుమార్ మృతదేహాలను ఆర్మీ కనుగొంది. టెర్రరిస్ట్‌లు విలేజ్ డిఫెన్స్ గార్డులను కిడ్నాప్ చేసి హత్య చేసిన తర్వాత కుంట్వారా, కేశ్వాన్ అడవి ప్రాంతాలో భారీ సెర్చ్ ఆపరేషన్‌ను గురువారం ఆర్మీ చేపట్టింది.