PARIS OLYMPICS: ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఈజిప్ట్ క్రీడాకారిణి

by Bhoopathi Nagaiah |
PARIS OLYMPICS: ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఈజిప్ట్ క్రీడాకారిణి
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌(OLYMPICS)లో పతకం గెల్చుకోవాలని ప్రతి క్రీడాకారుడు కలలు కంటాడు . కనీసం పతకం గెలవకపోయినా ఈ మెగా ఈవెంట్లో పాల్గొంటే చాలని ఎదురు చూసే వారు చాలా మందే ఉన్నారు.అయితే ఈజిప్ట్ దేశానికి చెందిన ఫెన్సర్, "నాడా హఫీజ్"(Nada Hafeez) మాత్రం మరో అడుగు ముందుకేసి, ఏడు నెలల నిండు గర్భంతో పారిస్ ఒలింపిక్స్ (PARIS OLYMPICS) పోటీల్లో బరిలోకి దిగింది.

కాగా.. ఈ 26 ఏళ్ల నాడా హఫీజ్ తన మూడో ఒలింపిక్స్‌లో మహిళల వ్యక్తిగత ఫెన్సింగ్ సాబర్ ఈవెంట్‌లో తన మొదటి మ్యాచ్‌ను గెలుచుకుంది. మహిళల వ్యక్తిగత ఫెన్సింగ్ పోటీలో 26 ఏళ్ల హఫీజ్ తన తొలి మ్యాచ్‌లో 15-13తో అమెరికాకు చెందిన ఎలిజబెత్ టార్టకోవ్‌స్కీపై గెలిచింది. అయితే దురదృష్టవశాత్తు ఆ తర్వాత జరిగిన 16వ రౌండ్‌లో దక్షిణ కొరియాకు చెందిన జియోన్ హయాంగ్‌ చేతి లో ఓడిపోయింది.

“సాధారణంగా ఒలింపిక్ వేదికపై ఇద్దరు ఆటగాళ్లు తలపడడం మీరు చూసి ఉండొచ్చు. కానీ ఈ వేదికపై మేం ముగ్గురం ఉన్నాం. నేను, నా ప్రత్యర్థి, అలాగే నా కడుపులోని పసి బిడ్డ. తాను ఇంకా మన ప్రపంచంలోకి అడుగు పెట్టలేదు! నేను ఇప్పుడు 7 నెలల గర్భవతినని తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ విషయం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసే వరకు చాలా మందికి తెలియదు. దీంతో ఆమె ధైర్యాన్ని, పట్టుదలను అభినందిస్తు అందరూ ట్వీట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed