- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజలు ఏమనుకున్నా నాకు నో ప్రాబ్లమ్: విమర్శలకు పాండ్యా కౌంటర్
దిశ, వెబ్‌డెస్క్: న్యూజిలాండ్‌ను వారి సొంతగడ్డపై చిత్తు చేసి.. 1-0 తేడాతో టీమిండియా టీ20 సిరీస్ కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవగా.. రెండవ టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. సిరీస్ డిసైడర్ 3వ టీ20 వర్షం కారణంగా డక్ వర్త్ లూయిస్ పద్దతిలో టైగా ముగిసిన విషయం తెలిసిందే. ఇక, ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వంటి సీనియర్లకు విశ్రాంతినిచ్చిన బీసీసీఐ.. సంజు శాంసన్, ఉమ్రాన్ మాలిక్ వంటి యంగ్ ప్లేయర్స్‌కు అవకాశం కల్పించి స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యాకు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, మిగిలిన రెండు మ్యాచుల్లోనూ సంజు శాంసన్, ఉమ్రాన్ మాలిక్‌కు ప్లేయింగ్ లెవన్‌లో చోటు దక్కలేదు. దీంతో కెప్టెన్ పాండ్యాపై విమర్శలు వెల్లువెత్తాయి. టాలెంటెడ్ ప్లేయర్స్ అయిన సంజు శాంసన్, ఉమ్రాన్ మాలిక్‌కు పాండ్యా కావాలనే అవకాశం ఇవ్వలేదని విమర్శలు చేస్తున్నారు.
వరల్డ్ కప్‌లో విఫలమైన రిషభ్ పంత్, భువనేశ్వర్ కుమార్, దీపక్ హుడాలకే మళ్లీ మళ్లీ అవకాశాలు ఇస్తూ.. సంజు శాంసన్‌తో పాటు ఉమ్రాన్ మాలిక్, కుల్దీప్ యాదవ్ లాంటి ప్లేయర్‌ను పూర్తిగా బెంచ్‌కే పరిమితం చేయడం సరికాదని అంటున్నారు. సిరీస్ ముగిసిన అనంతరం ఈ విమర్శలపై హార్ధిక్ పాండ్యా రియాక్ట్ అయ్యాడు. జట్టు వ్యూహాల్లో భాగంగానే తుది జట్టులో వారికి చోటు దక్కలేదని.. జట్టు కూర్పు గురించి కోచ్‌తో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపాడు. మ్యాచ్ పరిస్థిని బట్టి ఉత్తమ జట్టును ఎంపిక చేసే సమయంలో కొందరికి అవకాశం లభించకపోవచ్చని.. తర్వాత అందరికీ అవకాశాలు వస్తాయన్నాడు. జట్టులో స్థానం దక్కలేదని అసంతృప్తితో ఉన్న వారు వచ్చి తనతో చర్చించవచ్చని పేర్కొన్నాడు.