- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జకోవిచ్@ నం.1
న్యూఢిల్లీ: సెర్బియన్ టెన్నిస్ స్టార్ నోవాక్ జకోవిచ్ తన నంబర్ వన్ ర్యాంకును తిరిగి సాధించాడు. ఈ మేరకు సోమవారం విడుదలైన ఏటీపీ ర్యాంకింగ్స్‌లో స్పానిష్ ప్లేయర్ కార్లోస్ అల్కరాజ్‌ను వెనక్కి నెట్టిన జకో.. టాప్ ర్యాంకుకు చేరుకున్నాడు. వ్యాక్సిన్ వేసుకోని కారణంగా గత నెలలో జరిగిన యూఎస్ టోర్నీల్లో పాల్గొనకపోయినా తొలి స్థానానికి దూసుకెళ్లడం విశేషం. అల్కరాజ్ ఇండియన్ వెల్స్ టోర్నీలో విజేతగా నిలవడంతో జకోవిచ్ నుంచి నంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
కానీ, మియామీ ఓపెన్‌లో భాగంగా శుక్రవారం జరిగిన సెమీఫైనల్‌లో ఓటమితో తన ర్యాంకును కోల్పోవాల్సి వచ్చింది. దీంతో సెర్బియన్ స్టార్ తిరిగి ఒకటో స్థానానికి దూసుకొచ్చాడు. రెండో స్థానానికి పడిపోయిన అల్కరాజ్‌కు జకోకు మధ్య 380 పాయింట్ల తేడా ఉండగా, మూడో స్థానంలో నిలిచిన గ్రీస్ ప్లేయర్ సిట్సిపాస్‌కు నోవాక్‌కు మధ్య వెయ్యి పాయింట్ల తేడా ఉంది. ఇక, నాలుగు, ఐదో స్థానంలో మెద్వెదేవ్, కాస్పర్ రూడ్ ఉన్నారు. భారత ఆటగాళ్ల విషయానికొస్తే, రెండు స్థానాలు ఎగబాకి సుమిత్ నగాల్ 372వ స్థానంలో ఉండగా, డబుల్స్‌లో రోహన్ బోపన్న రెండు స్థానాలు దిగజారి 13వ స్థానానికి పడిపోయాడు.