సంచలన నిర్ణయం తీసుకున్న దినేశ్ కార్తీక్

by Harish |
సంచలన నిర్ణయం తీసుకున్న దినేశ్ కార్తీక్
X

దిశ, స్పోర్ట్స్ : భారత సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఇటీవలే ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన అతను తాజాగా క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని దినేశ్ కార్తీక్ శనివారం ఎక్స్ వేదికగా వెల్లడించాడు. ‘చాలా ఆలోచించిన తర్వాత కాంపిటేటివ్ క్రికెట్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. అధికారికంగా నా రిటైర్మెంట్‌ను ప్రకటిస్తున్నా. కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా. దేశానికి ప్రాతినిధ్యం వహించే అదృష్టం వచ్చిన కొందరిలో నేను ఒక్కడిని. నా ప్రయాణాన్ని ఆహ్లాదకరంగా మార్చిన కోచ్‌లు, కెప్టెన్లు, సెలెక్టర్లు, సహచరులు, సపోర్టింగ్ స్టాఫ్ అందరికి ధన్యవాదాలు.’ అని తెలిపాడు.

కాగా, ఐపీఎల్-17లో బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన అతను రాజస్థాన్‌తో ఆడిన ఎలిమినేటర్ మ్యాచే అతనికి చివరిది. భారత్ తరపున చివరిసారిగా టీ20 వరల్డ్ కప్-2022లో బంగ్లాదేశ్‌తో ఆడాడు. 39 ఏళ్ల దినేశ్ కార్తీక్ 2004లో ఇంగ్లాండ్‌పై అంతర్జాతీయ కెరీర్ మొదలుపెట్టాడు. దాదాపు 20 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో అతను భారత్ తరపున 26 టెస్టులు, 94 వన్డేలు, 60 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలుపుకుని అతను 3, 463 పరుగులు చేశాడు.

Advertisement

Next Story