- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఐదో టెస్టులో మరో కుర్రాడు అరంగేట్రం?.. అతను ఎవరు తెలుసా?
దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో మరో భారత యువ బ్యాటర్ అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతనెవరో కాదు దేవదత్ పడిక్కల్. ఈ కర్ణాటక క్రికెటర్ ఐదో టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్ కెరీర్‌ను ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. కేఎల్ రాహుల్ చివరి టెస్టుకు కూడా దూరమవడం, రజత్ పాటిదార్ పేలవ ఫామ్ కొనసాగిస్తుండటంతో పడిక్కల్ అరంగేట్రం ఖాయంగానే కనిపిస్తున్నది. అదే జరిగితే ఈ సిరీస్‌లో టెస్టుల్లోకి అరంగేట్రం చేయబోయే ఐదో క్రికెటర్ పడిక్కల్.
సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమ్ ఇండియా అదరగొడుతున్నది. రాంచీ టెస్టు విజయంతో 3-1తో సిరీస్‌ను పట్టేసింది. ఈ నెల 7 నుంచి 11 వరకు చివరిదైనా ఐదో టెస్టుకు ధర్మశాల ఆతిథ్యమివ్వనుంది. ఈ సిరీస్‌కు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ లాంటి సీనియర్లు గైర్హాజరులో ఉన్న సమయంలో యువకులు సత్తాచాటారు. ఈ సిరీస్‌లో ఇప్పటి వరకు నలుగురు కుర్రాళ్లు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు. రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, ఆకాశ్ దీప్ ఆ జాబితాలో ఉన్నారు. వీరిలో సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, ఆకాశ్ దీప్ వచ్చిన అవకాశాలను అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నారు. అయితే, కేఎల్ రాహుల్ గైర్హాజరుతో తుది జట్టులోకి వచ్చిన రజత్ పాటిదార్ మాత్రం దారుణంగా నిరాశపరిచాడు. వైజాగ్ టెస్టుతో అరంగేట్రం చేసిన అతను వరుసగా ఆరు ఇన్నింగ్స్‌లో 32, 9, 5, 0, 12, 0 పరుగులు చేశాడు. దీంతో రాంచీ టెస్టులోనే అతనికి తుది జట్టులో చోటు దక్కడం కష్టమే అని వార్తలు వచ్చాయి. అయితే, నిరూపించుకునేందుకు టీమ్ మేనేజ్‌మెంట్ మరోసారి అవకాశం ఇచ్చినా అతను సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
పడిక్కల్ వైపు మొగ్గు
కేఎల్ రాహుల్ ఐదు టెస్టుకు కూడా దూరమయ్యాడు. రజత్ పాటిదార్ అవకాశాలను అందిపుచ్చుకోవడంలో విఫలమవుతున్నాడు. ఈ పరిస్థితుల్లో టీమ్ మేనేజ్‌మెంట్ పడిక్కల్ వైపు చూస్తున్నది. ఆఖరి టెస్టులో అతనికి తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు ఉన్నాయిన క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పడిక్కల్ ఇప్పటికే టీ20 జట్టు తరపున 2021లో అరంగేట్రం చేశాడు. శ్రీలంక పర్యటనకు ఎంపికైన అతను ఆ సిరీస్‌లో నిరాశపరిచాడు. రెండు మ్యాచ్‌ల్లో కలిపి 38 పరుగులు మాత్రమే చేశాడు. ఈ పర్యటన తర్వాత జాతీయ జట్టుకు దూరమైన అతను ఇటీవల మంచి ప్రదర్శనలు ఇచ్చాడు. రంజీ ట్రోఫీతోపాటు భారత ఏ జట్టు తరపున సత్తాచాటాడు. రంజీ ట్రోఫీలో కర్ణాటక తరపున నాలుగు శతకాలు బాదాడు. అలాగే, ఇంగ్లాండ్ లయన్స్‌తో అనధికార టెస్టులోనూ సెంచరీ చేశాడు. ఒకవేళ ఆఖరి టెస్టులో అతనికి చోటు దక్కితే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సి ఉన్నది.