- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Devajit Saikia : జైషా స్థానాన్ని భర్తీ చేసిన బీసీసీఐ.. కొత్త సెక్రటరీ ఎవరంటే..?

X
దిశ, స్పోర్ట్స్ : మాజీ అస్సాం క్రికెటర్ దేవజిత్ సైకియా బీసీసీఐ సెక్రటరీగా, ప్రభ్‌తేజ్ భాటియా ట్రెజరర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం బీసీసీఐ స్పెషల్ జనరల్ మీటింగ్‌లో ఈ మేరకు ప్రకటించారు. బీసీసీఐ సెక్రటరీ, ట్రెజరర్ స్థానాలకు ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలయ్యాయి. దీంతో జైషా, అశిష్ షెలర్ స్థానంలో దేవజిత్, ప్రభ్‌తేజ్ కొత్త సెక్రటరీ, ట్రెజరర్‌గా ఎన్నికయ్యారు. డిసెంబర్ 1న జైషా ఐసీసీ చైర్మన్‌గా ఎంపిక కావడంతో అప్పటినుంచి దేవజిత్ సైకియా సెక్రటరీ అదనపు బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. ‘సెక్రటరీ, ట్రెజరర్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఎన్నికలు నిర్వహించలేదు.’ అని ఎలక్టోరల్ ఆఫీసర్ ఏకే జ్యోతి తెలిపారు. ఈ సమావేశంలో ఇటీవల ఐసీసీ చైర్మన్‌గా ఎంపికైన జైషాను సభ్యులు సన్మానించారు.
Next Story