- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా మెగ్‌లానింగ్..
దిశ, వెబ్‌డెస్క్: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో మరో జట్టు తమ కెప్టెన్‌ను ప్రకటించింది. ఆసీస్ సారథి మెగ్ లానింగ్‌ను కెప్టెన్‌గా నియమిస్తూ ఢిల్లీ క్యాపిటల్స్ ప్రకటన చేసింది. టీమ్ ఇండియా యంగ్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్‌ను ఆమెకు డిప్యూటీగా ఎంపిక చేసింది. ఇటీవల టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఆసీస్ జట్టుకు మెగ్ లానింగ్ కెప్టెన్ కాగా ఇప్పటి వరకు ఆమే సారథ్యంలో 5 సార్లు ప్రపంచ కప్ గెలవడం విశేషం.
ఇప్పటి వరకు 132 టీ20లు ఆడిన మెగ్ లానింగ్ 36.61 సగటుతో 116.7 స్ట్రైక్‌రేట్ 3,405 పరుగులు చేసింది. ఇందులో 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచులో మార్చి 5న బ్రబౌర్న్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఎదుర్కోనుంది. మహిళల ప్రీమియర్ లీగులో ఐదింట్లో మూడు జట్లను ఆసీస్ క్రికెటర్లే నడిపిస్తుండటం గమనార్హం. గుజరాత్ జెయింట్స్‌కు బెత్ మూనీ, యూపీ వారియర్స్‌కు అలీసా హేలీ సారథ్యం వహిస్తున్నారు. ఆర్సీబీకి స్మృతి మంధాన, ముంబయి ఇండియన్స్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్లుగా ఉన్నారు.