చెలరేగిన ఢిల్లీ ఓపెనర్లు.. చిత్తుచిత్తుగా ఓడిన ఆర్సీబీ

by Vinod kumar |
చెలరేగిన ఢిల్లీ ఓపెనర్లు.. చిత్తుచిత్తుగా ఓడిన ఆర్సీబీ
X

దిశ, వెబ్‌డెస్క్: డబ్ల్యూపీఎల్‌లో భాగంగా ఆర్సీబీతో ముంబయిలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 60 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ ఓపెనర్లు షెఫాలీ వర్మ, మెగ్‌ లానింగ్‌ నువ్వా నేనా అన్నట్టు పోటీపడి మరీ చితక బాదేశారు. షెఫాలీ 31 బంతుల్లో, లానింగ్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీలు అందుకోవడంతో జట్టు స్కోరు 9.4 ఓవర్లకు 100, 13.4 ఓవర్లకు 150 చేరుకుంది. 162 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం అందించారు.

వీరిద్దరు ఔటయ్యాక వచ్చిన మారిజానె కాప్‌, టీమ్‌ఇండియా రాక్‌స్టార్‌ జెమీమా రోడ్రిగ్స్‌ సిక్సర్లు, బౌండరీలు కొట్టడమే పనిగా పెట్టుకున్నారు. 18.2 ఓవర్లకే స్కోరు 200 దాటించారు. వీరిద్దరూ 31 బంతుల్లో 60 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పడంతో డీసీ స్కోరు 223/2కు చేరుకుంది. భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఆర్సీబీ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 163 పరుగులే చేసి ఓటమి పాలయింది. ఆర్సీబీ బ్యాటర్‌లో.. కెప్టెన్ స్మృతి మంధన 35, హీదర్ నైట్ 34, ఎలిస్ పెర్రీ 31, మేగాన్ షట్ 30 (నాటౌట్) పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో లెఫ్టార్మ్ మీడియం పేస్ బౌలర్ తారా నోరిస్ 5 వికెట్లు పడగొట్టడం విశేషం. తారా నోరిస్ అమెరికాకు చెందిన క్రికెటర్.

Advertisement

Next Story

Most Viewed