క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన డీడీ స్పోర్ట్స్..

by Vinod kumar |
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పిన డీడీ స్పోర్ట్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: వెస్టిండీస్‌ పర్యటనలో భాగంగా అతిథ్య విండీస్‌తో టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. జూలై 12 నుంచి డొమినికా వేదికగా జరగనున్న తొలి టెస్టుతో టీమిండియా టూర్‌ ప్రారంభం కానుంది. ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్‌లకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. జూలై రెండో వారంలో టీ20 జట్టును కూడా బీసీసీఐ ప్రకటించే అవకాశం ఉంది.

రోహిత్‌ శర్మ సారధ్యంలోని భారత జట్టు అన్ని విధాల సిద్దమవుతోంది. ఇప్పటికే జూలై 3నుంచి టీమ్ ఇండియా ప్రా‍క్టీస్‌ను కూడా మొదలుపెట్టింది. భారత్‌-విండీస్‌ మ్యాచ్‌లు కేబుల్ ఛానెల్‌లలో ప్రసారం చేయబడవు. కేబుల్ ఛానెల్స్‌కు బదులుగా డీడీ స్పోర్ట్స్ ఛానెల్ ఉచితంగా లైవ్ టెలికాస్ట్ చేయనుంది. డీడీ స్పోర్ట్స్‌తో పాటు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌ జియో సినిమా, ఫ్యాన్‌ కోడ్‌ కూడా ఈ మ్యాచ్‌లను ప్రచారం చేయనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed