CWC Qualifiers 2023: శ్రీలంక ఓపెనర్‌ అరుదైన రికార్డ్..

by Vinod kumar |   ( Updated:2023-06-28 06:54:32.0  )
CWC Qualifiers 2023: శ్రీలంక ఓపెనర్‌ అరుదైన రికార్డ్..
X

దిశ, వెబ్‌డెస్క్: CWC Qualifiers 2023లో భాగంగా ఐర్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక ఓపెనర్‌ దిముత్‌ కరుణరత్నే (103 బంతుల్లో 103; 8 ఫోర్లు) సెంచరీతో అదరగొట్టాడు. ఈ సెంచరీ కరుణరత్నేకు వన్డేల్లో మొదటిది కావడం విశేషం. దాదాపు రెండేళ్ల తర్వాత ఇటీవలే వన్డే జట్టులోకి వచ్చి తన తొలి సెంచరీని నమోదు చేశాడు. ఈ సెంచరీతో కరుణరత్నే అరుదైన ఫీట్ సాధించాడు. కరుణరత్నే.. ఈ మ్యాచ్‌తో కలుపుకుని తన చివరి 5 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 50 ప్లస్‌ స్కోర్‌లు చేశాడు. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై 103, దీనికి ముందు ఒమన్‌పై 61 నాటౌట్‌, యూఏఈపై 42, ఆఫ్ఘనిస్తాన్‌పై 56 నాటౌట్‌, ఆఫ్ఘనిస్తాన్‌పై 52 పరుగులు స్కోర్‌ చేశాడు.

గతంలో శ్రీలంక తరఫున 5 వరుస ఇన్నింగ్స్‌ల్లో 5 ఫిఫ్టి ప్లస్‌ స్కోర్లు చేసిన ఆటగాళ్లు నలుగురు ఉన్నారు. సనత్‌ జయసూర్య, కుమార సంగక్కర, తిలకరత్నే దిల్షన్‌, దినేశ్‌ చండీమాల్‌.. ఈ రేర్‌ ఫీట్‌ను సాధించారు. తాజాగా కరుణరత్నే ఈ ఫీట్‌ను సాధించడంతో దిగ్గజ క్రికెటర్లు సరసన చేరాడు. వన్డేల్లో వరుసగా ఫిప్టి ప్లస్‌ చేసిన రికార్డు పాకిస్తాన్‌ జావిద్‌ మియాందాద్‌ (9 వరుస 50 ప్లస్‌ స్కోర్లు) పేరిట ఉంది.

Advertisement

Next Story

Most Viewed