పెళ్లి పీటలు ఎక్కబోతున్న మరో చెన్నై ప్లేయర్..

by Vinod kumar |   ( Updated:2023-06-13 14:04:21.0  )
పెళ్లి పీటలు ఎక్కబోతున్న మరో చెన్నై ప్లేయర్..
X

దిశ, వెబ్‌డెస్క్: చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సీఎస్కేకి చెందిన మరో క్రికెటర్ సైతం త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. చెన్నై బౌలర్ తుషార్ దేశ్‌పాండే తన బాల్య స్నేహితురాలు నభా గడ్డమ్వార్‌ను పెళ్లాడనున్నాడు. ఇటీవలే ముంబైలో వీరి నిశ్చితార్థం జరిగింది. ‘నా స్కూల్ క్రష్ నుంచి ఫియాన్సీగా తనకు ప్రమోషన్ వచ్చింది’ అని తనకు ఎంగేజ్‌మెంట్ అయిన విషయాన్ని తుషార్ దేశ్‌పాండే సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.

నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశాడు. బంతిపై ఉంగరాలు ఉంచి.. ఇద్దరూ కలిసి దిగిన ఫొటో వైరల్‌గా మారింది. తుషార్ దేశ్‌పాండే 2023 ఐపీఎల్ సీజన్లో ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. అతడు 21 వికెట్లు తీశాడు. ఈ సీజన్లో చెన్నై తరఫున ఎక్కువ వికెట్లు తీసింది తుషార్ దేశ్‌పాండేనే కావడం గమనార్హం.

Advertisement

Next Story