Ashwin - Padma Sri Award : క్రికెటర్ రవిచంద్రన్ కు 'పద్మ అవార్డ్'... వారి కామెంట్స్ వైరల్

by M.Rajitha |
Ashwin - Padma Sri Award : క్రికెటర్ రవిచంద్రన్ కు పద్మ అవార్డ్...  వారి కామెంట్స్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం శనివారం 'పద్మ పురస్కారాలు'(Padma Awards) ప్రకటించిన సంగతి తెలిసిందే. భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) పద్మశ్రీ(PadmaSri) పురస్కారం అందుకోనున్నారు. ఈ క్రమంలో అశ్విన్ కు తాజా, మాజీల శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కాగా అశ్విన్ కు విషెస్ చెప్పే క్రమంలో మాజీ క్రికెటర్ల కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. "పద్మశ్రీ అందుకున్న తొలి తమిళ క్రికెటర్ అశ్విన్. కుర్రాళ్లకు అతను మార్గదర్శి. ఎంతో గర్వంగా ఉంది" అంటూ భారత మాజీ క్రికెటర్ సుబ్రమణియన్ బద్రీనాథ్(Subramaniyan Badrinath) పోస్ట్ చేశారు. దానిలొ ఓ పొరపాటు ఉందంటూ మాజీ కోచ్ డబ్ల్యూవీ రామన్(WV Raman).." పద్మ అవార్డు అందుకున్న తొలి తమిళ క్రికెటర్ వెంకట్రావఘన్. 2003లో పురస్కారం అందుకున్నారు. మొత్తం క్రీడాకారుల పరంగా చూసినా ఎంఏ గోపాలన్ మొదటి వ్యక్తి" అంటూ పోస్ట్ పెట్టారు. దానికి బద్రీనాథ్ స్పందిస్తూ.. నా అజ్ఞానానికి మన్నించాలి. వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు" అంటూ మరొక పోస్ట్ పెట్టారు. కాగా ఈ మొత్తం వ్యవహారం అంతా ప్రెజెంట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

Next Story